‘క్యాట్’ రిజిస్ట్రేషన్లకు అక్టోబర్ 10న అవకాశం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లు, ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)-2014 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, దరఖాస్తుల ప్రక్రియకు అక్టోబర్ 10న అవకాశం ఉంది. ఈ ఏడాది క్యాట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగాల్సి ఉండగా మధ్యలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఒకరోజు ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 10న రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ఇండోర్ నిర్ణయించింది.
గతేడాది క్యాట్‌కు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఈసారి ఇప్పటివరకు 1.89 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కామన్ అడ్మిషన్ టెస్ట్ నవంబర్ 16, నవంబర్ 22న ఉదయం, మధ్యాహ్నం.. రెండు సెషన్లుగా జరగనుంది. ఫలితాలు డిసెంబర్ మూడో వారంలో వెలువడే అవకాశాలున్నాయి. వివరాలకు వెబ్‌సైట్: https://iimcat.ac.in/