
హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: హోంగార్డుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలపై ప్రభుత్వ స్పందన కోసం ఆమరణదీక్ష చేస్తున్న వారి ఆరోగ్యం విషమించక ముందే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హోంగార్డులకు ఇస్తున్న వేతనాలు నామమాత్రంగా ఉన్నాయని, చాలీచాలని బతుకులు వెళ్లదీస్తున్నారన్నారు.