విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాష్ట్రంలో జరుపుకుంటున్న ఈ తొలి నవమిని ఊరూరా వేడుకగా జరుపుకోవాలని అభిలషిస్తున్నట్టు సీఎం చెప్పారు. లోక కల్యాణం కోరుకునే ఒంటిమిట్ట శ్రీరాముడు కొత్త రాష్ట్రంలో మన సమస్యల్ని ఒడ్డున పడేస్తారని ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.ఆడిన మాట తప్పని శ్రీరామచంద్రుడే మనకు ఆదర్శం కావాలని, శాంతి సౌభాగ్యాలతో విలసిల్లే శ్రీరామరాజ్యాన్ని మనం మళ్లీ దీక్షాదక్షతలతో సాధించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.