
ప్రజలకు వైఎస్ జగన్ నవమి శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అటు భద్రాద్రిలోను, ఇటు ఒంటిమిట్టలోను, రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లోనూ.. ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రజలందరికీ శుభాలు కలిగేలా సీతారాముల ఆశీస్సులు లభించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.