ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇదివరకే వెలువరించిన జీవో–146లో పలు మార్పులు చేసింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా సోమవారం ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి జీవో–146లోని కొన్ని అంశాలపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల మేరకు, ప్రాజెక్టుల్లో ఐబీఎంలో వేసిన అంచనాలకు అదనంగా కొత్త కాంక్రీటు నిర్మా ణాలు, అదనపు నిర్మాణాలు, లైనింగ్ పనులు చేరితే ఆ పనులకనుగుణంగా అంచనా వ్యయాన్ని పెంచుకునేందుకు ఆమోదం తెలిపారు.
ఇక 2013 ఏప్రిల్ తర్వాత నిర్మాణ మవుతున్న, అయిన ప్రాజెక్టులన్నింటికీ ఐబీఎంలో వేసిన దానికన్నా ఎస్కలేషన్ ఎంత ఎక్కువ అవుతుందన్నది అంచనా వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిజైన్ సమయంలో.. ప్రస్తుత మార్పుల తర్వాత పెరిగే వ్యయాన్నీ అంచనా వేయాలి. 60(సి) నిబంధన కింద ఎవరైనా కాంట్రాక్టర్‌ను తొలగిస్తే వారికి చెల్లించాల్సినవి చెల్లించాలని వివరించారు. నెట్టెంపాడు, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పనుల్లోని ప్యాకేజీల్లో కొన్ని అంశాలను విస్మరించారని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఎస్కలేషన్ జీవో–146లో మార్పులు
Published Tue, May 9 2017 3:04 AM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM
Advertisement