ఈ దాడిలో మాఫియా ఆధీనంలో పెద్ద సంఖ్యలో వృద్ధులు, మైనర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నగరంలో పలు ప్రధాన కూడళ్లలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాఫియా టీమ్ వీరిచే బెగ్గింగ్ చేయిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ బిక్షాటన ద్వారా ప్రతి రోజు వచ్చిన డబ్బులో కొంత మొత్తం వీరికి ఇస్తూ.. మిగతా సొమ్మును మాఫియా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు..
Published Wed, Oct 5 2016 9:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
హైదరాబాద్ : నగరంలో భారీగా విస్తరించిన బెగ్గింగ్ మాఫియా గుట్టును పోలీసులు రట్టుచేశారు. నాంపల్లిలోని ఓ లాడ్జిలో బస చేసిన మాఫియాపై చైల్డ్ రైట్ కమిషన్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు బుధవారం ఉదయం మెరుపు దాడి చేశారు.

Advertisement
Advertisement