
బాలీవుడ్‌పై కన్నేసిన చైనా భామ
చైనా నటి ఝాంగ్ జియి బాలీవుడ్‌పై కన్నేసింది. క్రోషింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్, రష్ అవర్ వంటి యాక్షన్ సినిమాల్లో తన వీరవిద్యలతో ఆకట్టుకున్న ఝాంగ్, అవకాశం లభిస్తే, బాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందంటూ మనసులో మాటను బయటపెట్టింది. ‘ఇఫి’ వేడుకల్లో ముంబై విచ్చేసిన ఆమె.. ‘నమస్తే’ అంటూ పలకరించింది. బాలీవుడ్‌లో అవకాశం లభిస్తే, డ్యాన్సర్‌గా సత్తా చూపిస్తానంటోంది ఝాంగ్.