
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సోమవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు.
విభజన అనంతర సమస్యలు, సచివాలయ భవనాల అప్పగింత, ఉద్యోగుల పంపకాలు, తదితర కీలక సమస్యల పరిష్కారంపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించారు. రెండు రాష్ట్రాల మంత్రులు గవర‍్నర్ సమక్షంలో బుధవారం ఉదయం సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయించారు.