జగదేవ్‌పూర్ (మెదక్) : నాలుగు రోజులుగా ఫాంహౌస్‌లో బస చేసిన సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళ్లారు. గురువారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి సీఎం వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఫాంహౌస్‌లో పంటలను ఆయన పరిశీలించారు. ఖరీఫ్ పనులపై పలు సూచనలు చేసినట్లు తెలిసింది. అనంతరం కాన్వాయ్‌లో వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలించారు. పాలిహౌస్ పనులు వేగంగా పూర్తి చేయాలని నిర్వహకులకు సూచించినట్లు తెలిసింది. సాయంత్రం 5 గంటల సమీపంలో రోడ్డు మార్గాంలో హైదరాబాద్‌కు వెళ్లారు.