శనివారం రామోజీరావును ఆయన నివాసంలో పరామర్శిస్తున్న సీఎం కేసీఆర్.
సాక్షి, హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. కొద్ది రోజుల కింద అనారోగ్యానికి గురైన రామోజీరావు ప్రైవేటు కార్పొరేటు ఆసుప త్రిలో చికిత్స పొందినట్లు తెలిసింది. ఇటీవలే కోలుకున్న రామోజీరావు బేగంపేటలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్... రామోజీరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ వెంట ప్రముఖ వైద్యుడు ఎంవీ రావు తదితరులున్నారు.