‘కానిస్టేబుల్’ రాత పరీక్షకు 99.64 % మంది హాజరు | constable exam details in telangana | Sakshi
Sakshi News home page

‘కానిస్టేబుల్’ రాత పరీక్షకు 99.64 % మంది హాజరు

Published Mon, Oct 24 2016 2:47 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

‘కానిస్టేబుల్’ రాత పరీక్షకు 99.64 % మంది హాజరు - Sakshi

‘కానిస్టేబుల్’ రాత పరీక్షకు 99.64 % మంది హాజరు

సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్, ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించినరాత పరీక్షకు రికార్డు స్థాయిలో 99.64 శాతం మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. తెలంగాణ పోలీసు శాఖ పరిధిలో పోలీసు కానిస్టేబుల్(సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్‌పీఎఫ్)లో కానిస్టేబుల్(పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహించిన ఈ రాత పరీక్షకు మొత్తం 81,357 మంది అభ్యర్థుల్లో 81,070 మంది హాజరయ్యారు. 

రికార్డు స్థాయిలో 99.64 శాతం హాజరు నమోదైంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 9,281 పోస్టుల భర్తీకి ఈ పరీక్షను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 153 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచంద్ర రావు తెలిపారు. మూడు నెలల్లో ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement