ఓవైసీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం | Court orders Saroornagar police to register case against Asaduddin Owaisi | Sakshi
Sakshi News home page

ఓవైసీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Published Fri, Jul 15 2016 1:06 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

Court orders Saroornagar police to register case against Asaduddin Owaisi

హైదరాబాద్: హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ ఇత్తెహాదులు ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీపై కేసు నమోదుకు 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు సరూర్ నగర్ పోలీసులను ఆదేశించింది. హైదరాబాద్ నగరానికి చెందిన అడ్వకేట్ కరుణా సాగర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది.

జాతీయ దర్యప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసిన ఉగ్రవాదులకు న్యాయసహాయం అందిస్తామనడం దేశద్రోహులకు ఆక్సిజన్ అందించడం లాంటిదేనని పిటిషనర్ ఆరోపించారు.  ఇది పరోక్షంగా ఉగ్రవాదులకు మద్దతు పలకడమేనని కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన  కోర్టు ఓవైసీ పై కేసు నమోదుకు ఆదేశించింది.

హైదరాబాద్ లో భారీ విధ్వసానికి కుట్రుపన్నిన ఉగ్రవాదులను ఎన్ఐఏ వలపన్ని అరెస్టు చేసింది. దీనిపై స్పందించిన ఓవైసీ ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement