తమ్మినేని, చాడా వెంకటరెడ్డి అరెస్ట్
హైదరాబాద్ : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల పిలుపుతో తెలంగాణలో బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్లోని ఎంజీబీఎస్ వద్ద సీపీఐ నేతలు బైఠాయించారు.
ఈ సందర్భంగా సీపీఐ నేతలు తమ్మినేని వీరభద్రం, చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభెత్వం పారిశుద్ధ్య కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. కార్మికులందరికీ వేతనాలు పెంచాల్సిందేనని, వారి డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. కాగా ఆందోళన చేస్తున్న సీపీఐ నేతలు తమ్మినేని వీరభద్రం, గోవర్థన్, ఎండీ గౌస్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి అఫ్జల్ గంజ్ చేశారు. ఇక చాడా వెంకటరెడ్డి సహా మరో30మందిని అరెస్ట్ చేసి గోషా మహల్ పోలీస్ స్టేషన్, ఐఎఫ్టీయూ నేతలు అనురాధా, నరేంద్రలను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లకు తరలించారు.