
బీజేపీని నడిపిస్తున్నది నల్లకుబేరులే
- ప్రజలకు కేంద్రం క్షమించరాని ద్రోహం చేసింది: నారాయణ
- పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా వామపక్షాల భారీ ర్యాలీ
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు క్షమించరాని ద్రోహం చేసిందని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. నల్ల కుబేరులు ఎవరి వైపు ఉన్నారో ప్రజలకు తెలుసునని, నేడు బీజేపీ ప్రభుత్వాన్ని వెనక నుంచి నడిపిస్తున్నది వారేనని ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం వామ పక్షాలు రాజధానిలో భారీ ర్యాలీ నిర్వహిం చారుు. సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ, సీపీఐ (ఎంఎల్), ఆర్‌ఎస్‌పీ, ఎస్‌యూసీఐతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇందులో పాల్గొన్నారుు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌స మీదుగా ఇందిరా పార్కు వరకు సాగిన ఈ ర్యాలీకి జనం భారీగా తరలి వచ్చారు. ‘ప్రధాని మోదీ డౌన్.. డౌన్... నోట్ల రద్దు నిర్ణయం వెనక్కు తీసుకోవాలి’అంటూ నినాదాలు చేశారు.
నారాయణ మాట్లాడు తూ... ‘స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్ల దనాన్ని వెలికి తీయకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. నల్ల కుబేరుల జాబితాను వికీలీక్స్ బయటపెట్టినా... వారిపై చర్యలెందుకు తీసు కోవడం లేదు? నోట్ల రద్దు ప్రజలపై సర్జికల్ దాడి. అంబానీ వంటి వారికి ముందుగా తెలిశాకనే నోట్లను రద్దు చేశారు. వాళ్లంతా డబ్బు మార్చుకున్నాకే సామాన్యులకు తెలి సింది. విజయ్ మాల్యా కోట్లాది రూపాయల రుణాలను రద్దు చేయాల్సిన అవసరం ఏముం ది’అని ప్రశ్నించారు.
నిత్యావసరాలు కొనుక్కోలేని పరిస్థితి: రాఘవులు
ప్రస్తుతం దేశంలో సామాన్య ప్రజలు నిత్యా వసర వస్తువులను కూడా కొనుక్కోలేని పరిస్థితి దాపురించిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. ‘నిజంగా నల్లధనం సామా న్యుల దగ్గర ఉం దా.. లేక కార్పొరేట్ శక్తుల వద్ద ఉందా అనేది మోదీకి తెలియదా? స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి పేద ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న మోదీ.. ఆ ప్రస్తావనే వదిలేసి నోట్లు రద్దుచేయడంవల్ల ప్రయోజన మేమిటి’ అని రాఘవులు మండిపడ్డారు. ఈ ర్యాలీలో సీపీఎం రాష్ట్ర నాయ కులు జూలకంటి రంగారెడ్డి, డీజీ నర్సిం హారావు, సీపీఐ నేత బి.వెంకటస్వామిగౌడ్, వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు బి.సారుు నాథ్‌రెడ్డి, నాయకులు బి.వెంకటరమణ, రఘురామి రెడ్డి, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, ఎఎస్‌యూసీఐ నాయకులు ముర హరి, ఆర్‌ఎస్‌పీ జానకి రాములు, పీవైఎల్ హన్మేష్, పీడీఎస్‌యూ గౌతం ప్రసాద్, ఐద్వా ఆశాలత, అరుణజ్యోతి, పీఓడబ్ల్యూ జి.ఝాన్సీ, ఎస్.ఎల్.పద్మ పాల్గొన్నారు.
నల్లధనం వెనక్కు తేలేకనే...
నల్లధనాన్ని వెనక్కి తేలేకనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టనట్టుగా ఉందన్నారు. పర్సెంటేజీలకు ఆశపడి, కార్పొరేట్ శక్తులతో కుమ్మకై ్క బ్యాంకు అధికారులు బ్లాక్ మనీని వైట్‌గా మారు స్తున్నారన్నారు. చిల్లర లభించక ఇబ్బం దులకు గురై మృతి చెందిన వారికి ప్రభు త్వం రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.