కేటీఆర్‌ను కాపాడేందుకు నిజాలు దాచొద్దు | CPM fires on Minister KTR, TRS | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ను కాపాడేందుకు నిజాలు దాచొద్దు

Published Sat, Aug 5 2017 3:34 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

CPM fires on Minister KTR, TRS

మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీపీఎం హితవు
 
సాక్షి, హైదరాబాద్‌: కేటీఆర్‌ మంత్రిగా ఉండి హిమాన్షు మోటార్‌ కంపెనీలో డైరెక్టర్‌గా కొనసాగడం చట్టవిరుద్ధమని అభియోగాలు వెల్లువెత్తుతుంటే, వాటికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వాస్తవాలు దాటవేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. టీఆర్‌ఎస్‌కు చట్టాలు, రాజ్యాంగంపై గౌరవం ఉంటే వెంటనే కేటీఆర్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించి విచారణకు ఆదేశించాలని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేసింది. హిమాన్షు కంపెనీలో కేటీఆర్‌ వాటాలపై మొదటి సారి చర్చ వెలుగులోకి వచ్చినప్పుడు తనకు ఆ కంపెనీతో ఏడేళ్లుగా ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్‌ పేర్కొన్నారని గుర్తుచేశారు.

పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాత్రం కంపెనీ ఉన్నా యాక్టివిటీలో లేదంటున్నారని పేర్కొంది. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో హిమాన్షు మోటారు కంపెనీలో 3 లక్షల షేర్లు ఉన్నాయని, వాటి విలువ రూ.30 లక్షలు అని పేర్కొన్నారని, కేటీఆర్‌ డైరెక్టర్‌ హోదాలో 2015–16 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటన్స్‌ను తన సంతకంలో సమర్పించారని వివరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడితే తప్పులు ఒప్పు కావని, కేటీఆర్‌తో రాజీనామా చేయించి జవాబుదారీతనంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండాలని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement