సీఎంకు అర్థమైంది కానీ ఆ పార్టీ నేతకే.. | cpm leaders join into trs | Sakshi
Sakshi News home page

సీఎంకు అర్థమైంది కానీ ఆ పార్టీ నేతకే..

Published Mon, Mar 20 2017 6:48 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

సీఎంకు అర్థమైంది కానీ ఆ పార్టీ నేతకే.. - Sakshi

సీఎంకు అర్థమైంది కానీ ఆ పార్టీ నేతకే..

హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన సీపీఎం ముఖ్యనేతలు అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. నిజమైన కమ్యూనిస్ట్ తెలంగాణ సీఎం కేసీఆరే అని, బడ్జెట్‌లో కేటాయింపులే ఇందుకు నిదర్శనమని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి సీపీఎం నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అర్థమైంది కానీ ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రంకు అర్థంకాలేదని కేటీఆర్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన కేరళ ముఖ్యమంత్రి విజయన్‌.. కేసీఆర్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.

కేంద్ర మంత్రి సుష్మాకు లేఖ: సౌదీ అరేబియాలోని జైళ్లలో ఉన్న 29 మంది తెలంగాణ వారిని విడిపించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కేటీఆర్ కోరారు. ఆయన ఈ మేరకు లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement