కలసివచ్చే శక్తులతో పనిచేస్తాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
సాక్షి, సంగారెడ్డి: తమ పార్టీ ఎజెండాను ఆమోదించే శక్తులతో రాజకీయంగా కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆరు రోజులుగా మహాజన పాదయాత్ర చేస్తున్న తమ్మినేని బుధవారం విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ రాజకీయంగా ఒంటరైందని, ఎంఐఎం మినహా మరే ఇతర పార్టీ టీఆర్‌ఎస్‌ను సమర్థించడం లేదన్నారు. మంత్రి కేటీఆర్ తమ పాదయాత్రపై చేసిన విమర్శలను తమ్మి నేని ఖండించారు. ప్రజాసమస్యలపై ప్రభు త్వానికి 26 లేఖలు రాసినా స్పందన లేద న్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్ హామీలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. సింగూరు జలాలను ఉమ్మడి మెదక్ జిల్లా వ్యవసాయ అవస రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పాదయాత్రకు జగ్గారెడ్డి సంఘీభావం
సీపీఎం మహాజన పాదయాత్రకు పీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంఘీభావం ప్రకటించారు. సంగారెడ్డి కొత్త బస్టాండు నుంచి పట్టణ శివారు వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సంఘీభావం..
పాదయాత్రకు వైఎస్సార్ సీపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంఘీ భావం తెలిపారు. కొంతదూరం వరకు పాదయాత్ర లో తమ్మినేనితోపాటు పాల్గొన్నారు.