ఎంపీ అసదుద్దీన్పై కేసులు | Criminal case against MP Asaduddin owaisi | Sakshi
Sakshi News home page

ఎంపీ అసదుద్దీన్పై కేసులు

Published Wed, Feb 3 2016 2:01 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

ఎంపీ అసదుద్దీన్పై కేసులు - Sakshi

ఎంపీ అసదుద్దీన్పై కేసులు

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ మ్మద్ షబ్బీర్ అలీ ఫిర్యాదు మేరకు  మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన అనుచరులపై మీర్‌చౌక్ పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. 143, 323, 341, 427, 506, ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. సియాసత్ ఉర్దూ దినపత్రిక విలేకరి ముబాషీర్ పై దాడికి పాల్పడిన ఘటనలో కూడా అసద్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.  పోలీసుల వివరాల ప్రకారం.. సియాసత్ విలేకరి ముబాషీర్(35) విధి నిర్వహణలో ఉండగా ఎంపీ అసదుద్దీన్ తన అనుచరులతో వచ్చి దాడికి పాల్పడ్డారు. ముబాషీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు అసద్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement