తీరని కరెన్సీ కష్టాలు | Currency troubles continues | Sakshi
Sakshi News home page

తీరని కరెన్సీ కష్టాలు

Published Mon, Nov 21 2016 3:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

తీరని కరెన్సీ కష్టాలు - Sakshi

తీరని కరెన్సీ కష్టాలు

- బ్యాంకులకు సెలవుకావడంతో ఏటీఎంలకు పోటెత్తిన జనం
- చాలాచోట్ల ‘నో క్యాష్’బోర్డులు
- పనిచేసిన కొన్నిచోట్ల చాంతాడంత లైన్లు
- కుదేలైన వ్యాపారాలు.. సందడి లేని మాల్ ్స, థియేటర్లు
- కళ తప్పిన మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు
- సందర్శకులు లేక వెలవెలబోరుున పర్యాటక ప్రాంతాలు
 
 సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల కష్టాలు ఇంకా తీరడం లేదు! ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో జనం ఏటీఎం కేంద్రాలకు పోటెత్తారు. చాలాచోట్ల ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’బోర్డులు దర్శనమివ్వడంతో వినియోగదారులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. పనిచేసిన కొన్ని ఏటీఎం సెంటర్ల ముందు జనం బారులుతీరారు. ఎప్పట్లాగే గంటలకొద్దీ నిరీక్షణ తప్పలేదు. ఆదివారం రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. అటు వ్యాపారాలు కుదేలయ్యారుు. మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు కళ తప్పారుు. సెలవు దినాల్లో జనంతో కిటకిటలాడే హైదరాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, గేమింగ్ జోన్లు వెలవెలబోయారుు. ఇక థియేటర్లలో ప్రేక్షకులు సగానికి పైగా తగ్గారు. బంజారాహిల్స్‌లోని సినీమ్యాక్స్‌లో ఉన్న పీవీఆర్‌లో అన్ని షోలకూ ప్రేక్షకులు కరువయ్యారు.

జీవీకే వన్, హైదరాబాద్ సెంట్రల్, బిగ్‌బజార్‌లోని స్క్రీన్లు కూడా కళ తప్పారుు. మరోవైపు చిల్లర లేక పలుచోట్ల ఫ్రీ పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. పాతనగరంలో పాత నోట్ల పరేషాన్ ఇంకా కొనసాగుతోంది. మార్కెట్లు కూడా కోలుకోలేదు. బంగారం, వెండి, ముత్యాల వ్యాపారులతోపాటు వస్త్ర వ్యాపారాలు, మీరాలం మండి, మోండా, బేగంబజార్, సుల్తాన్‌బజార్ తదితర మార్కెట్‌లు ప్రజల సందడి లేక బోసిపోరుు కనిపించారుు. కూరగాయలు, పండ్ల వ్యాపారులు కూడా చిల్లరకష్టాలతో అష్టకష్టాలు పడ్డారు. కొనేవారు లేక దిగాలుగా కూర్చున్నారు. ఎరగ్రడ్డ రైతుబజార్‌లో రాష్ట్రంలో మెదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద పాత రూ.500, 1,000 నోట్లకు ఏడు రకాల నిత్యావసర సరుకులను అందించే దుకాణాన్ని ఏర్పాటు చేశారు.

 జోరుగా కమీషన్ దందా..
 పెద్ద నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు కొత్త పంథా అవలంభిస్తున్నారు. పాత నోట్లు తీసుకోవడానికి ఇంకా సమయం ఉన్నా పాతనోట్లు తీసుకొచ్చినవారి నుంచి కమీషన్లు దండుకుంటున్నారు. 30 శాతం కమిషన్‌గా ఇస్తే పాత నోట్లను స్వీకరించి కావాల్సిన వస్తువులును ఇస్తామంటూ నయా వ్యాపారానికి తెరలేపుతున్నారు.
 
 డీసీసీబీల్లో ‘మార్పిడి’పై కొనసాగుతున్న ఆంక్షలు
 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో పెద్ద నోట్ల మార్పిడిని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) విధిం చిన ఆంక్షలు కొనసాగుతున్నారుు. మొద ట్లో దాదాపు వారం పాటు పెద్ద నోట్లను మార్చుకోవడానికి అంగీకరించి.. ఆ తర్వాత నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్పిడితోపాటు తమ సొమ్మును బ్యాంకుల్లో జమ చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఆ బ్యాంకులు రబీ రుణాలను ఇచ్చే పరిస్థితి లేకుండా పోరుుంది. అటు రుణాలు రాక.. ఇటు తమ వద్ద ఉన్న పాత పెద్దనోట్లను మార్పిడి చేసుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. రాష్ట్రంలో 35 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటుండగా అం దులో 12 లక్షల మంది రైతులకు డీసీసీబీకి చెందిన 272 బ్యాంకు బ్రాంచీల్లో ఖాతాలు ఉండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement