Notes Difficulties
-
క్యాష్‌లెస్ 30 శాతమే !
మోర్తాడ్(బాల్కొండ) /నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని 25 ఎస్బీఐ శాఖలను క్యాష్‌లెస్ బ్యాంకింగ్ కోసం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో మోర్తాడ్ మండలంలోని సుంకెట్, తిమ్మాపూర్, కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి, కిసాన్‌నగర్, తొర్లికొండ ఎస్బీఐ శాఖలతో పాటు మరో 20 ఎస్బీఐ శాఖలు ఉన్నాయి. ఈ బ్యాంకుల పరిధిలో క్యాష్‌ను అసలే వినియోగించకూడదని పూర్తిగా డిజిటల్ లావాదేవీలనే నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. బ్యాంకు శాఖ పరిధిలోని వ్యాపారులకు స్వైప్ యంత్రాలను అందించి క్యాష్‌లెస్ లావాదేవీలను నిర్వహించేలా చూడాలని సూచించారు. కాని స్వైప్ యంత్రాలను ఆశించిన విధంగా సరఫరా చేయకపోవడంతో నగదు రహితం నామమాత్రమే అయ్యింది. కాగా గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం క్యాష్‌లెస్ లావాదేవీలను నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం అని బ్యాంకర్లు చెబుతున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంతో బ్యాంకుల్లో కాగితాలతో పని లేకుండా పోయిందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా నగదు కొరత వల్ల బ్యాంకుల్లో తక్కువ మొత్తంలో డ్రా చేసుకోవడానికే అధికారులు అనుమతి ఇస్తున్నారు. ప్రజలు మాత్రం తమకు అవసరమైన నగదును డ్రా చేసుకోవడానికి రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మరోవైపు పెద్ద నోట్లు రద్దయి ఏడాది పూర్తియినా ప్రజలకు ఇంకా నోట్ల కష్టాలు తప్పలేదు. జిల్లాలో 268 బ్యాంకులు ఉన్నాయి. ఇందులో 33 ప్రెయివేటు బ్యాంకులు ఉన్నాయి. 245 ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండకపోవడం తరచుగా తలెత్తుతున్న సమస్య. ప్రస్తుతం ఏటీఎంలలో రెండువేల నోట్లు కొన్నిసార్లు మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. ఏటీఎంలలో ఐదు వందల నోట్లు అందుబాటులో ఉంచుతున్నారు. వరుసగా సెలవులు వస్తే, పండుగల సందర్భాలలో ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండటం లేదు. కొన్ని ప్రాంతాలలో ఏటీఎంలు నోట్ల రద్దు తర్వాత పని చేయడం లేదు. నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కొత్తగా రూ.200, రూ. 50 కొత్త నోట్లు తీసుకువచ్చింది. మొదట్లో స్వైపింగ్ యంత్రాల హడావుడి సాగినా.. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు తగ్గిపోయాయి. కొద్ది మంది మాత్రమే కొన్ని చోట్ల స్వైపింగ్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. నగదురహిత లావాదేవీల కోసం ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు అంతగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు. పట్టణ ప్రాంతాల్లో సైతం నగదురహిత లావాదేవీలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. స్వైపింగ్యంత్రాల ద్వారా కొనుగోలు చేస్తే వినియోగదారుడికే పన్నుభారం పడటంతో కొనుగోలు చేపట్టడం లేదు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయి గ్రామంలో 409 కుటుంబాలు ఉండగా మొత్తం జనాభా 1374 ఉన్నారు. పిల్లలుపోను మిగతా 1,156 మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారు. కామారెడ్డి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంక్‌లలో వారి ఖాతాలు ఉన్నాయి. నగదు రహిత లావాదేవీల గురించి గ్రామంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. గ్రామంలో కిరాణ దుకాణాలు, మెడికల్ షాప్, హోటళ్లు, కల్లు దుకాణాలు.. ఇలా మొత్తంగా 17 మంది వద్ద స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయడానికి అధికారులు బ్యాంకర్లకు ప్రతిపాదనలు పంపించారు. అయితే కిరాణ దుకాణం నిర్వహించే రాచర్ల చంద్రం, హోటల్ నిర్వాహకుడు చంద్రాగౌడ్, రేషన్ డీలర్ లావణ్య, గ్రామ పంచాయతి, వాటర్ ప్లాంట్ నిర్వాహకులు మాత్రమే స్వైపింగ్ మిషన్లు తీసుకున్నారు. గ్రామంలో చాలా మంది క్యాష్‌లెస్ ట్రాన్జాక్షన్స్కు దూరంగా ఉన్నారు. చదువురాదని కొంద రు, ఖాతాలో సొమ్ము దాచుకునే స్థోమత లేక ఇంకొందరు.. పాతపద్ధతిలోనే లావాదేవీలు జ రిపారు. 70 నుంచి 80 మంది మాత్రం నూతన విధానాన్ని అనుసరించారు. ఏటీఎం కార్డులతో లావాదేవీలు జరిపారు. రెండు మూడు నెలలు క్యాష్‌లెస్ లావాదేవీలు జరిగాయి. అయితే కొత్తనోట్ల చలామణి పెరగడంతో నగదు కష్టాలు తగ్గాయి. దీంతో ప్రజలు క్రమంగా క్యాష్‌లెస్ ట్రాన్జాక్షన్స్కు దూరమయ్యారు. -
ఎనీ టైం నో క్యాష్
ఏటీఎంలలో నగదు కొరత 15 రోజులుగా నిలిచిన డబ్బుల సరఫరా అవస్థలు పడుతున్న ప్రజలు నిజామాబాద్‌అర్బన్: నోట్ల కష్టాలు మళ్లీ తీవ్రమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డులు దర్శనిమిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 15 రోజులుగా డబ్బుల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నగదు కోసం అవస్థలు పడుతున్నారు. రిజర్వు బ్యాంకు నుంచి డబ్బుల సరఫరా నిలిచిపోవడంతో ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 366 బ్యాంకులు ఉండగా వీటి పరిధిలో 392 ఏటీఎంలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో లేకపోవడంతో మూసి ఉంచుతున్నారు. కొన్ని రోజులుగా ఏటీఎంలు పనిచేయకపోవడంతో ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుంటున్నారు. దీనికి కూడా అధికారులు పరిమితిలోపే నగదును ఇస్తున్నారు. ఖాతాదారులు బ్యాంకుల్లో జమ చేసిన డబ్బులనే ఇతర ఖాతాదారులకు అందజేస్తున్నారు. రెండు జిల్లాలకు ఆర్బీఐ నుంచి సుమారు ప్రతినెలా రూ. 186 కోట్ల రూపాయలు అందిస్తున్నారు. వీటి ద్వారానే ఏటీఏంలు, లావాదేవీలు కొనసాగుతాయి. కానీ డబ్బుల సరఫరా నిలిచిపోవడంతో అవస్థలు మొదలయ్యాయి. బ్యాంకులు చాలా చోట్ల ఏటీఎంలను మూసేస్తున్నాయి. ఫిబ్రవరి చివరి రోజుల్లో ఈ అవస్థలు మొదలు కాగా ప్రస్తుతం మరింత తీవ్రమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా బ్యాంకుల్లోనూ నగదు ఇవ్వడంలేదు. జమ చేయడం తప్ప విత్ డ్రాకు అనుమతి ఇవ్వడం లేదు. నగదు విత్ డ్రాలో పరిమితులు విధిస్తున్నారు. అడిగిన దాని కంటే తక్కువగా డబ్బులు అందిస్తున్నారు. ప్రస్తుతం మార్చి నెల కావడంతో లావాదేవీలు అధికంగా ఉంటాయి. ఈ తరుణంలో నగదు కొరత ఇబ్బందికరంగా మారింది. ఆర్బీఐ నుంచి డబ్బులు సరఫరా అయితే తప్పా సమస్య కొలిక్కివచ్చే అవకాశం లేదు. నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న రెండు ప్రధాన బ్యాంకుల శాఖల ఏటీఎంలు వెలవెలబోతున్నాయి. ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలలో కూడా నగదు అందుబాటులో లేదు. ప్రస్తుతం శుభకార్యాలు ఉండడంతో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరం ఉన్న వారు సైతం బ్యాంకుల చుట్టూ డబ్బుల కోసం తిరుగుతున్నారు. తగ్గిన నగదు రహిత లావాదేవీలు గతేడాది నవంబర్ 8న కేంద్రప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్లరద్దు తర్వాత జిల్లాలో నగదు రహిత లావాదేవీలు పెంచాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు నగదు రహిత లావాదేవీలపై విస్తృత ప్రచారం చేపట్టారు. అప్పట్లో కొనుగోళ్లు, అమ్మకాల్లో నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. అనంతరం కొత్తనోట్లు మార్కెట్లోకి అందుబాటులోకి రావడంతో క్రమేపీ నగదు రహిత లావాదేవీలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు తగ్గిపోవడం, కొత్తనోట్ల సరఫరా ఆగిపోవడంతో ఇబ్బందులు తల్తెతున్నాయి. -
నో క్యాష్
జిల్లా వాసులను నోట్ల కష్టాలు ఇప్పట్లో వీడేటట్లు లేవు. పెద్ద నోట్లు రద్దయి 14 రోజులు గడస్తున్నా ప్రజలు ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నగదు మార్పిడి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకుల అవసరాలకు తగ్గట్టుగా ఆర్బీఐ నుంచి నగదు రాకపోవడం సమస్యను మరింత జఠిలం చేసింది. ఏటీఎం కేంద్రాలు పూర్తి స్థాయిలో ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురావడంలో బ్యాంకు శాఖలు విఫలమయ్యాయి. దీంతో ఖాతాదారులు నగదు కోసం కష్టాలు పడాల్సివస్తోంది. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా విత్‌డ్రాను రూ.4వేలకు కుదించారు. తిరుపతి (అలిపిరి):పెద్ద నోట్లు రద్దయి రెండు వారాలు గడుస్తున్నా జిల్లా ప్రజలకు కరెన్సీ కష్టాలు తీరడం లేదు. ఆదివారం రోజున బ్యాంకులు సెలవు ప్రకటించడంతో సోమవారం రద్దీ పెరిగింది. నోటు మార్పిడికి, నగదు విత్‌డ్రాలకు అవస్థలుపడ్డారు. ఎస్బీఐ ప్రధాన శాఖలకు గంట ఆలస్యంగా నగదు చేరుకోవడంతో ప్రజలు ముందు పడిగాపులు కాశారు. ఉదయం 11 గంటలకు బ్యాంకుల లావాదేవీలు ప్రారంభమయ్యారుు. జిల్లాలో 708 ఏటీఎం కేంద్రాలు ఉంటే కేవలం 20 శాతం మాత్రమే అరకొర సేవలు అందించారుు. ఏటీఎం కేంద్రాల్లో నగదు ఉంచిన గంటలోపే ఖాళీ అవుతుండడంతో క్యూలో నిలుచున్న ఖాతాదారులు అసౌకర్యానికి లోనయ్యారు. పనిచేసిన కొన్ని ఏటీఎంలలో నగదు డ్రా చేస్తే రూ.2వేల నోటు వస్తుండడంతో ప్రజలు షాక్‌కు గురయ్యా రు. రూ.2వేల నోటు ఎలా మార్చాలో అర్థం కాక తలపట్టుకున్నారు. జిల్లాలోని 40 జాతీయ బ్యాంకు శాఖల్లో రూ.20 కోట్ల మేర నగదు మార్పిడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. విత్ డ్రా 4వేలకు పరిమితం ఎస్బీఐ ప్రధాన శాఖలు విత్‌డ్రా పరిమితిని 4వేలకు కుదించాయి. ప్రజా అవసరాలకు తగ్గట్టుగా బ్యాంకుల్లో నగదు నిల్వలేకపోవడంతో బ్యాంకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకులకు పూర్తి స్థాయిలో నగదు అందే వరకు పూర్తి స్థాయి సేవలందించలేమని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు నచ్చజెబుతున్నారు. ఖాతాదారులు చేసేది లేక అరకొర నగదు తీసుకుని వెనుదిరుగుతున్నారు. జిల్లాకు మొండి చెయి.. జిల్లాలో నగదు మార్పిడి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారని, అత్యవసరం నిమిత్తం రూ.1000 కోట్లు అవసరమని జిల్లా బ్యాంకు అధికారులు ఆర్బీఐకి విన్నవించారు. అధికారుల అభ్యర్థనలను ఆర్బీఐ కనీసం పట్టించుకోలేదు. ఆర్బీఐ సోమవారం జిల్లాలకు పంపిన అరకొర నిధులతో ప్రజలకు, ఖాతాదారులకు పూర్తి స్థారుులో సేవలు అందించలేక బ్యాంకు అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఏటీఎంల ముందు ‘నో క్యాష్’ బోర్డులు తిరుపతిలో 6 ఏటీఎం కేంద్రాల వద్దకు వెళ్లా. ప్రతిచోటా నో క్యాష్ బోర్డులు పెట్టారు. ప్రరుువేట్ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. డబ్బుకోసం ఉదయం నుంచి క్లాసుకు వెళ్లకుండా ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా. ఆర్బీఐ స్పందించి ఏటీఎంలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. - శ్రీకాంత్, తిరుపతి అవసరానికి నగదు ఇవ్వకుంటే ఎలా? అత్యవసర పనులకు నగదు అవసరమైతే తిరుపతి ఎస్బీఐ ప్రధాన శాఖకు వచ్చా. వారానికి రూ.24వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఆర్బీఐ కల్పించింది. అయితే నగదు కొరతంటూ బ్యాంకు అధికారులు విత్‌డ్రా పరిమితిని రూ.4వేలకు కుదించారు. అత్యవసరం నిమిత్తం కూడా నగదు డ్రా చేసుకునే వెసులుబాటు ఇవ్వకుంటే ఎలా? - బాషా, టైలర్, తిరుపతి -
తీరని కరెన్సీ కష్టాలు
- బ్యాంకులకు సెలవుకావడంతో ఏటీఎంలకు పోటెత్తిన జనం - చాలాచోట్ల ‘నో క్యాష్’బోర్డులు - పనిచేసిన కొన్నిచోట్ల చాంతాడంత లైన్లు - కుదేలైన వ్యాపారాలు.. సందడి లేని మాల్ ్స, థియేటర్లు - కళ తప్పిన మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు - సందర్శకులు లేక వెలవెలబోరుున పర్యాటక ప్రాంతాలు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల కష్టాలు ఇంకా తీరడం లేదు! ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో జనం ఏటీఎం కేంద్రాలకు పోటెత్తారు. చాలాచోట్ల ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’బోర్డులు దర్శనమివ్వడంతో వినియోగదారులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. పనిచేసిన కొన్ని ఏటీఎం సెంటర్ల ముందు జనం బారులుతీరారు. ఎప్పట్లాగే గంటలకొద్దీ నిరీక్షణ తప్పలేదు. ఆదివారం రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. అటు వ్యాపారాలు కుదేలయ్యారుు. మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు కళ తప్పారుు. సెలవు దినాల్లో జనంతో కిటకిటలాడే హైదరాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, గేమింగ్ జోన్లు వెలవెలబోయారుు. ఇక థియేటర్లలో ప్రేక్షకులు సగానికి పైగా తగ్గారు. బంజారాహిల్స్‌లోని సినీమ్యాక్స్‌లో ఉన్న పీవీఆర్‌లో అన్ని షోలకూ ప్రేక్షకులు కరువయ్యారు. జీవీకే వన్, హైదరాబాద్ సెంట్రల్, బిగ్‌బజార్‌లోని స్క్రీన్లు కూడా కళ తప్పారుు. మరోవైపు చిల్లర లేక పలుచోట్ల ఫ్రీ పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. పాతనగరంలో పాత నోట్ల పరేషాన్ ఇంకా కొనసాగుతోంది. మార్కెట్లు కూడా కోలుకోలేదు. బంగారం, వెండి, ముత్యాల వ్యాపారులతోపాటు వస్త్ర వ్యాపారాలు, మీరాలం మండి, మోండా, బేగంబజార్, సుల్తాన్‌బజార్ తదితర మార్కెట్లు ప్రజల సందడి లేక బోసిపోరుు కనిపించారుు. కూరగాయలు, పండ్ల వ్యాపారులు కూడా చిల్లరకష్టాలతో అష్టకష్టాలు పడ్డారు. కొనేవారు లేక దిగాలుగా కూర్చున్నారు. ఎరగ్రడ్డ రైతుబజార్లో రాష్ట్రంలో మెదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద పాత రూ.500, 1,000 నోట్లకు ఏడు రకాల నిత్యావసర సరుకులను అందించే దుకాణాన్ని ఏర్పాటు చేశారు. జోరుగా కమీషన్ దందా.. పెద్ద నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు కొత్త పంథా అవలంభిస్తున్నారు. పాత నోట్లు తీసుకోవడానికి ఇంకా సమయం ఉన్నా పాతనోట్లు తీసుకొచ్చినవారి నుంచి కమీషన్లు దండుకుంటున్నారు. 30 శాతం కమిషన్‌గా ఇస్తే పాత నోట్లను స్వీకరించి కావాల్సిన వస్తువులును ఇస్తామంటూ నయా వ్యాపారానికి తెరలేపుతున్నారు. డీసీసీబీల్లో ‘మార్పిడి’పై కొనసాగుతున్న ఆంక్షలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో పెద్ద నోట్ల మార్పిడిని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విధిం చిన ఆంక్షలు కొనసాగుతున్నారుు. మొద ట్లో దాదాపు వారం పాటు పెద్ద నోట్లను మార్చుకోవడానికి అంగీకరించి.. ఆ తర్వాత నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్పిడితోపాటు తమ సొమ్మును బ్యాంకుల్లో జమ చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఆ బ్యాంకులు రబీ రుణాలను ఇచ్చే పరిస్థితి లేకుండా పోరుుంది. అటు రుణాలు రాక.. ఇటు తమ వద్ద ఉన్న పాత పెద్దనోట్లను మార్పిడి చేసుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. రాష్ట్రంలో 35 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటుండగా అం దులో 12 లక్షల మంది రైతులకు డీసీసీబీకి చెందిన 272 బ్యాంకు బ్రాంచీల్లో ఖాతాలు ఉండడం గమనార్హం.