హైదరాబాద్ : పాలన సౌలభ్యం కోసం ఇప్పటికే జిల్లాల విభజనపై కసరత్తు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం...మరోవైపు శాంతి భద్రతలను మరింత పటిష్ట పరిచేందుకు పోలీస్ కమిషరేట్ల విభజనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ రెండుగా విభజించింది.
సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్‌గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌లో భువనగిరి, మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, సరూర్‌నగర్, చౌటుప్పల్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం ఉండనుండగా.....సైబరాబాద్ వెస్ట్ జోన్ కమిషనరేట్‌లో బాలానగర్, మాదాపూర్, కూకట్‌పల్లి, శంషాబాద్, మియాపూర్, రాజేంద్రనగర్, షాద్‌నగర్‌లు ఉండనున్నాయి.
రంగారెడ్డి, సైబరాబాద్, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తెచ్చింది. అలాగే డీజీపీ అనురాగ్ శర్మ విజ్ఞప్తి మేరకు సైబరాబాద్ కమిషనరేట్ కు రాష్ట్ర సర్కారు అదనపు సిబ్బందిని మంజూరు చేసింది. 346 పోలీస్, 135 మినిస్ట్రీరియల్ స్టాఫ్, 2000 హోంగార్డ్స్, 41 ఔట్ సోర్సింగ్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- సైబరాబాద్ కమిషనరేట్ ఈస్ట్ లోని జోన్స్: బోనగిరి, మల్కాజ్ గిరి, ఎల్బీనగర్.
- డివిజన్స్: బోనగిరి, చౌటుప్పల్, మల్కాజ్గిరి, కుషాయి గూడ, వనస్థలిపురం, ఎస్బీ నగర్, ఇబ్రహీం పట్నం.
- సీసీఎస్లు: బోనగిరి, మల్కాజ్గిరి, ఎల్బీనగర్.
-
మహిళా పోలీస్ స్టేషన్: సరూర్ నగర్
- సైబరాబాద్ కమిషనరేట్ వెస్ట్ లోని జోన్స్: బాలానగర్, మాదాపూర్, శంశాబాద్.
- డివిజన్స్: బాలానగర్, పహాడీషరీఫ్, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్, షాద్ నగర్.
- సీసీఎస్లు: బాలానగర్, మాదాపూర్, శంషాబాద్.
- మహిళా పోలీస్ స్టేషన్: ఐటీ కారిడార్.