'జనసేన పార్టీని రద్దు చేయాలి' | Derangula Uday Uiran demand for Jena Sena Cancellation | Sakshi
Sakshi News home page

'జనసేన పార్టీని రద్దు చేయాలి'

Published Mon, Jul 18 2016 10:57 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

'జనసేన పార్టీని రద్దు చేయాలి' - Sakshi

'జనసేన పార్టీని రద్దు చేయాలి'

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా, సంక్షేమ పథకాలు అందక ప్రజలు ఆందోళన చెందుతుంటే జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నాడని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ ప్రశ్నించారు. ప్రజలకు, అభిమానులకు న్యాయం జరగని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటూ పార్టీ ఆవిర్భావ సమయంలో గొప్పలు చెప్పిన పవన్ కల్యాణ్ అధికారపక్షంపై పల్లెత్తుమాటైనా వ్యాఖ్యానించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా ఉన్నందున జనసేన పార్టీని ఎన్నికల సంఘం రద్దు చేయాలని డిమాండ్ చే శారు. పవన్ ఎక్కడున్నాడంటూ ప్రజలంతా ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కట్టుకున్న భార్యకు, పుట్టిన బిడ్డకు న్యాయం చేయని పవన్ ప్రజలకు ఏమి చేస్తాడని ఎద్దేవా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement