వ్యాపార రంగాన్ని ప్రోత్సహిస్తాం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వ్యాపార వర్గాల పన్ను రాయితీపై త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్‌నంబర్-12లో జరిగిన మహరాజ్ శ్రీఅగ్రసేన్‌జయుంతి ఉత్సవాల్లో ఆయున వుుఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వ్యాపారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తెలంగాణలో అత్యున్నత పారిశ్రామిక పాలసీని అవులు చేసి అన్ని రంగాల వృద్ధికి తోడ్పడుతామన్నారు.
ఇటీవల సింగపూర్ వెళ్లి అక్కడి అభివృద్ధిని అధ్యయనం చేసి వచ్చానని, హైదరాబాద్ మెట్రో ప్రాంతం కాస్మోపాలిటన్ కల్చర్‌కు నవుూనాగా ఉందని సీఎం తెలిపారు. సవూజానికి వైశ్యులు మార్గదర్శకంగా నిలుస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. నగరంలోని పాతబస్తీలో అల్లర్లు జరిగినప్పుడు వైశ్యులు, వుర్వాడీలు దుకాణాలు తెరచి ప్రజలకు సహకరించారన్నారు. తెలంగాణ ఉద్యవుంలో కూడా వైశ్యులు భాగస్వామ్యులయ్యారని కొనియాడారు.
పన్ను రారుుతీపై మంచి పాలసీ తెస్తా: సీఎం
Published Fri, Sep 26 2014 1:19 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement