శునకాన్ని చంపి లైంగికదాడి | dog is died by sexual arrasment | Sakshi
Sakshi News home page

శునకాన్ని చంపి లైంగికదాడి

Published Mon, Oct 24 2016 10:53 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

శునకాన్ని చంపి లైంగికదాడి - Sakshi

శునకాన్ని చంపి లైంగికదాడి

రాజేంద్రనగర్‌: మద్యం మత్తులో ఓ యువకుడు గర్భంతో ఉన్న శునకాన్ని చంపి దానిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.   ఎస్సై నాగాచా రి తెలిపిన వివరాల ప్రకారం...ఢిల్లీకి చెందిన అస్లాంఖాన్(20) వారం రోజుల క్రితం నగరానికి వచ్చి శాస్త్రీపురం ప్రాంతంలో ఉంటూ చిల్లరగా తిరుగుతున్నాడు.
 
సోమవారం ఉదయం ప్రధాన రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలంలోని చెట్ల మధ్యకు ఓ కుక్కను తీసుకు వెళ్లిన అతను దానిని మెడ పిసికి చంపి లైంగిక దాడికి దిగాడు. సమీపంలోని ఓ ఇంటిలో ఉంటున్న జహంగీర్‌ అనే వ్యక్తి దీనిని చూసి కుమారులకు చెప్పడంతో వారు స్థానికుల సహాయంతో అస్లాంను పట్టుకుని చితకబాదారు. అనంతరం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. శునక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement