ఫలించిన ప్రయోగాలు | Experiments Gospel account | Sakshi
Sakshi News home page

ఫలించిన ప్రయోగాలు

Published Thu, May 7 2015 2:31 AM | Last Updated on Sat, Aug 11 2018 8:57 PM

ఫలించిన ప్రయోగాలు - Sakshi

ఫలించిన ప్రయోగాలు

గణనీయంగా తగ్గిన స్నాచింగ్‌లు
గతేడాది మొదటి నాలుగు నెలల్లో 220 కేసులు
ఈ ఏడాది 103 మాత్రమే నమోదు
చైన్‌స్నాచర్లపై పీడీ యాక్ట్ నమోదే ప్రధాన కారణం

 
సిటీబ్యూరో:  నేరాల నివారణ కోసం నగర పోలీసులు చేస్తున్న సరికొత్త ప్రయోగాలు ఫలితాలిస్తున్నాయి.  చైన్‌స్నాచింగ్‌లు గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనం.  నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 2013 (జనవరి నుంచి ఏపిల్)్రలో 265 స్నాచింగ్ కేసులు నమోదు కాగా... 2014లో 220కి తగ్గాయి. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 103కు తగ్గింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సాధారణంగా నేరాలు కూడా పెరుగుతుంటాయి. అయితే చైన్‌స్నాచింగ్‌ల విషయంలో మాత్రం పెరగాల్సిన కేసులను మరింత తగ్గించగలిగారు.  కరుడుగట్టిన 33 మంది చైన్ స్నాచర్లపై ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం (పీడీ యాక్ట్) ప్రయోగించడంతో పాటు మరో 70 మంది స్నాచర్లను జైళ్లకు పంపడమే ఇందుకు కారణం. నగర పోలీసు కమిషనర్‌గా గతేడాది జూన్ 2న బాధ్యతలు చేపట్టిన ఎం.మహేందర్ హైదరాబాద్‌ను నేర రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగానే చైన్‌స్నాచర్లపై పీడీయాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించారు. గతంలో కేవలం కరుడు గట్టిన రౌడీషీటర్లపైనే పీడీయాక్ట్ ప్రయోగించేవారు.

అయితే, తొలిసారిగా మహేందర్‌రెడ్డి చైన్‌స్నాచర్లపై పీడీయాక్ట్ ప్రయోగించే కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. గడిచిన 10 నెలల కాలంలో కరుడుగట్టిన 33 మంది స్నాచర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ప్రస్తుతం వీరంతా చర్లపల్లి జైలులో ఉన్నారు. ఏడాది పాటు వీరంతా అక్కడ ఉండాల్సిందే. గతంలో చైన్‌స్నాచర్లను అరెస్టు చేసి జైలుకు పంపితే ఒకటి రెండు రోజుల్లోనే వారికి బెయిల్ వచ్చేది. బెయిల్‌పై బయటకు వచ్చిన వారు మళ్లీ నేరాలు మొదలుపెట్టేవారు.  దీన్ని పసిగట్టిన మహేందర్‌రెడ్డి వారికి బెయిల్ లభించకుండా ఉండేందుకు పీడీ యాక్ట్‌ను ఆయుధంగా చేసుకోవడంతో స్నాచింగ్‌లు తగ్గుతున్నాయి. గతంలో నగరంలోని 60 శాంతి భద్రతల పోలీసుస్టేషన్ల పరిధిలో రోజుకు రెండు చొప్పున స్నాచింగ్‌లు జరగగా.. ఇప్పుడు ఒకటి చొప్పున జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో స్నాచింగ్‌లను పూర్తిగా నివారిస్తామని పోలీసులంటున్నారు.
 
 పీడీ యాక్ట్ నమోదైన చైన్‌స్నాచర్లు వీరే...
 
ఈస్ట్‌జోన్: మహ్మద్ సైఫుద్దీన్, మహ్మద్ ఇమ్రాన్, సయ్యద్‌ముజీబ్.
సౌత్‌జోన్: షరీఫ్, అహ్మదుద్దీన్ సిద్దిఖ్, జావేద్,  సాలమ్‌జాబ్రీ, పి.లక్ష్మణ్, సంతోష్‌కుమార్, ఎం.భాస్కర్, సయ్యద్‌అబ్దుల్‌మాజీద్, సయ్యద్ అస్లమ్.
సెంట్రల్‌జోన్: మహ్మద్‌అమీర్, దాసరి సురేందర్, షేక్‌సలీం, నరేష్‌బాల్కీ, జి.విజయ్‌కుమార్‌చౌదరి, మహ్మద్‌ఫైసల్, సయ్యద్‌ఇమ్రాన్, అబ్దుల్‌బిన్‌హాజీ.
వెస్ట్‌జోన్: మహ్మద్‌ఫైసల్, ఇర్ఫాన్‌ఖాన్, ఖాజాఫరీదుద్దీన్, మహ్మద్‌అబ్దుల్‌గఫూర్, మహ్మద్‌మెహరాజ్, మహ్మద్‌అఫ్రోజ్, మహ్మద్‌ఇఫ్తేకర్, మహ్మద్‌ఫైసల్‌షాఅలీజాబ్రీ, మహ్మద్‌ఫర్హాన్, బి.జైకిషోర్‌సింగ్, వెంకటేష్.
నార్త్‌జోన్: మహ్మద్‌ఖలీల్, మహ్మద్‌ముజీబ్‌అహ్మద్
 
 మరింత తగ్గిస్తాం

 
బంగారు నగలు ధరించి ఒంటరిగా వెళ్లే మహిళలకు పోలీసులకు అండగా ఉంటారు.  మేము తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గత మూడేళ్లలో చైన్‌స్నాచింగ్‌లు తగ్గాయి. రానున్న రోజుల్లో నేరాలను మరింత తగ్గిస్తాం.  ఎక్కడైనా స్నాచింగ్ జరిగితే కేవలం నెలరోజుల్లోనే నిందితుడ్ని గుర్తించి బాధితులకు న్యాయం చేస్తాం. ఇందులో భాగంగా ప్రతి స్టేషన్‌పరిధిలో సీసీ కెమెరాల ప్రాజెక్ట్ వర్క్ చురుగ్గా జరుగుతోంది.
   
 - మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement