ముస్లిం రిజర్వేషన్లపై పోరు
బీజేపీ కోర్‌కమిటీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్ల పెంపు బిల్లును అసెంబ్లీలో ఏ రోజు పెడితే ఆ రోజు నుంచి సభలో, బయటా దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం కావాలని బీజేపీ కోర్‌కమిటీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార అంశాన్ని చేసే విధంగా పార్టీ అన్ని స్థాయిల్లో పోరాటాలకు సిద్ధం కావాలని నిర్ణయానికి వచ్చింది. పార్టీకి సైద్ధాంతికంగా కీలకమైన ఈ అంశంపై వెనకడుగు వేయకుండా, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనాలని కోర్‌కమిటీ తీర్మానించింది.
నిరసనలో భాగంగా శాసనసభ ముట్టడి వంటి కార్యక్రమాలను నిర్వహించాలని, 17న అన్ని జిల్లాల్లో ఆందోళనలను నిర్వహించాలని కమిటీ నిర్ణయిం చింది. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో మతపరమైన రిజర్వేషన్లపై చర్చ జరిగింది. ఈ సంద ర్భంగా రిజర్వేషన్ల బిల్లుకు వ్యతిరేకంగా అనుసరించా ల్సిన వ్యూహం పై చర్చించారు. పార్టీ అనుబంధ సం ఘాలైన యువమోర్చా, మహిళామోర్చాలను భాగస్వా ములను చేసి ముందుకు సాగాలని నిర్ణయించారు.
మే మూడో వారంలో రాష్ట్రానికి అమిత్ షా
వచ్చేనెల మూడో వారంలో లేదా 23 నుంచి 27 తేదీల మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి రానున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పార్టీవర్గాల సమాచారం.