నేటి నుంచి ఎంబీఏ, ఎంసీఏ వెబ్ ఆప్షన్లు | From today, MBA, MCA Web options | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎంబీఏ, ఎంసీఏ వెబ్ ఆప్షన్లు

Published Wed, Sep 7 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

నేటి నుంచి ఎంబీఏ, ఎంసీఏ వెబ్ ఆప్షన్లు

నేటి నుంచి ఎంబీఏ, ఎంసీఏ వెబ్ ఆప్షన్లు

10న మార్పులు.. 12న సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్య కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేయడంతో ఆయా కోర్సుల్లో ప్రవేశాలను చేపట్టేందుకు ప్రవేశాల కమిటీలు చ ర్యలు చేపట్టాయి. ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ తదితర కోర్సుల్లో వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించాయి. కాలేజీల వారీగా సీట్లు, ఫీజుల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన వారు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులని స్పష్టం చేశాయి. ఇక ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారమే వెబ్ ఆప్షన్లు ప్రారంభించగా... న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలను వారంలో ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 10 వరకు ఐసెట్ వెబ్ ఆప్షన్లు
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ ఎంవీ రెడ్డి తెలిపారు. 10వ తేదీన ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని.. 12వ తేదీ రాత్రి 8 గంటల తరువాత సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. కేటాయింపు వివరాలను ్టటజీఛ్ఛ్టి.జీఛి.జీ  వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఒకటో ర్యాంకు నుంచి 30 వేల ర్యాంకు వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు మంగళవారమే వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు లాగిన్ ఐడీలను పంపించామని.. మిగతా వారికి బుధవారం పంపిస్తామని వెల్లడించారు. ఇక 284 ఎంబీఏ కాలేజీల్లో 21,898 సీట్లు.. 38 ఎంసీఏ కాలేజీల్లో 1,909 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

 12 వరకు పీజీఈసెట్...
ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు మంగళవారమే ప్రారంభమైనట్లు పీజీఈసెట్ కో-కన్వీనర్ రమేశ్ తెలిపారు. 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని.. 14న సీట్లు కేటాయించి, 19వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. కాగా 156 ఎంటెక్ కాలేజీల్లో 9,414 సీట్లు అందుబాటులో ఉండగా.. 83 ఎంఫార్మసీ కాలేజీల్లో 3,689 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

 నెలాఖరులోగా లా ప్రవేశాలు
మూడేళ్లు, ఐదేళ్ల న్యాయ విద్యలో (లా) ప్రవేశాల కౌన్సెలింగ్, ప్రవేశాలను ఈనెలాఖరులోగా పూర్తి చేస్తామని లాసెట్ కన్వీనర్ ఎంవీ రంగారావు తెలిపారు. కాలేజీలు, సీట్లకు సంబంధించి బార్ కౌన్సిల్ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందన్నారు. 15న జరిగే సమావేశంలో స్పష్టత వస్తుందని.. తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా 18 న్యాయ కళాశాలలు ఉండగా వాటిలో సుమారు 3 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

రేపటి నుంచి ఎడ్‌సెట్...
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రసాద్ వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులంతా కొత్తగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని.. గతంలో ఇచ్చిన ఆప్షన్లను మార్పుకోవచ్చని తెలిపారు. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకానివారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి వీల్లేదని వెల్లడించారు. 15వ తేదీన సీట్లు కేటాయిస్తామన్నారు. కాగా రాష్ట్రంలోని 184 బీఎడ్ కాలేజీల్లో 15,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 12,400 సీట్లు, మేనేజ్‌మెంట్ కోటాలో 3,100 సీట్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement