హైదరాబాద్ : పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ఆంక్షలు విధించింది. జూలై 31వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల తయారీ, వినియోగాన్ని నగరంలో నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గడువు దాటిన తర్వాత కూడా వీటిని తయారు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వినియోగదారులపైనా చర్యలుంటాయన్నారు.