ఓ గాడ్ | GOD | Sakshi
Sakshi News home page

ఓ గాడ్

Published Tue, Feb 3 2015 11:57 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

ఓ గాడ్ - Sakshi

ఓ గాడ్

 పెన్ ధర ఎంత ఉంటుంది? మరీ కాస్ట్‌లీదైతే వెయ్యో, రెండు వేలో! కానీ లక్షల విలువైన పెన్నులున్నాయి. అయితే, ఇవి ‘రాయడానికా, ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడానికా!?’ అని ఆశ్చర్యపోకండి. అది మీ ఛాయిస్. అవసరమైతే రాయొచ్చు. మీరు అభిమానించేవారికి కానుకగా అయినా ఇవ్వొచ్చు. ఇష్టమైతే పూజ కూడా చేసుకోవచ్చు.. ఎలా అంటారా ఆ పెన్నులపై మీ ఇష్ట దేవతల పెయింటింగ్స్ ఉంటాయి.
 ..:: కట్టా కవిత
 
 విలువైన పెన్నుల రూపకర్త విలియం పెన్ సంస్థ ఈసారి శివుడు, విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడు, మహావిష్ణువు.. ఇలా హిందూ దేవతల చిత్రాలతో ఏపీ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఈ పెన్నుల తయారీ సంస్థ 1920ల నాటి రష్యన్ లాకర్ మినియేచర్ ఆర్ట్‌తో వీటిని అందంగా రూపొందించింది. కలకాలం తీపిగుర్తుగా పదిలపర్చుకోవడానికి వీలుగా ఈ కలాలను తీర్చిదిద్దింది.
 
 
 ‘పెన్’టాస్టిక్ థీమ్స్
  నందీశ్వరుడిపై కొలువుదీరిన శివుడి థీమ్‌తో తయారు చేసిన పెన్ పేరు- ఆల్‌మైటీ శివ. దీని ఖరీదు... నాలుగున్నర లక్షల రూపాయలు.
 ‘ద డివైన్ కపుల్’.. విష్ణువు, మహాలక్ష్మి రూపాల్ని అద్భుతంగా తనలో ఇముడ్చుకున్నదీ కలం. ఈ స్టన్నింగ్ ఫౌంటెన్ పెన్ ధర కూడా నాలుగున్నర లక్షలే.అల్లరి పనులతో ఆకట్టుకునే చిలిపి కృష్ణుని చిత్రాలను ఇష్టపడనిదెవరు చెప్పండి. అలాంటి కృష్ణుడి గౌరవార్ధం తయారు చేసినదే ‘ద యంగ్ కృష్ణ’ పెన్. దీని విలువ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు.
 
 తలపై నెమలి ఈక, చేతిలో వేణువుతో ఉన్న కృష్ణుడి చిత్రంతో చూపరులను పరవశంలో ముంచెత్తుతున్న పెన్ ‘ద డివైన్ మెలడీస్’. దీని ఖరీదు నాలుగున్నర లక్షల రూపాయలు.
 విఘ్నాధిపతి వినాయకుడు, సిరులు కురిపించే మహాలక్ష్మి అంశతో రూపొందించిన పెన్ ‘ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్’. మాస్టర్ ఆర్టిస్ట్ నటాషా కుర్కినా పెయింటింగ్స్‌తో రూపొందిన ఈ పెన్ విలువ నాలుగున్నర లక్షలు.
 
 భారతీయ పురాణాల ఆధారంగా రూపొందించిన పెన్నే ‘ద డ్యాన్సింగ్ గణేషా’. విజ్ఞానానికి అధిపతి అయిన ఈ విఘ్నేశ్వరుడిని చిత్రించిన ఈ పెన్ను విలువ 2.75 లక్షల
 రూపాయలు. ఈ పెన్‌ల గురించి మరిన్ని విశేషాల కోసం
 www.williampenn.net
 చూడండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement