
మంచి ముత్యాలు
విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన విదేశీ వనితలు సిటీలో షాపింగ్ సరదా తీర్చుకుంటున్నారు. హెచ్‌సీయూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జువెలరీ.. క్లాత్ సెంటర్‌లలో విదేశీ వనితలు తమ అభిరుచికి తగ్గట్టుగా షాపింగ్ చేసుకుంటున్నారు. అక్కడే ఓ షాపులో ఖాదీ వస్త్రాలను, ముత్యాలహారాలను తీసుకుంటున్న కెనడాకు చెందిన షానూన్ పోలే, జామై రుక్‌లను సిటీప్లస్ పలకరించింది.
‘హైదరాబాద్‌కు వచ్చి ముత్యాలు కొనకుండా వెళ్తామా’ అంటూ షానూన్ పోలే ముత్యాలహారాన్ని మురిపెంగా చూశారు. ఇంత అందమైన, నాణ్యమైన వస్త్రాలను కొనకుండా ఎలా ఉండగలమన్నారు జామై రుక్‌మన్. వారు కొన్న వస్తువులను పేపర్ సంచుల్లో పెట్టి ఇవ్వడాన్ని మరింత ఎంజాయ్ చేశారు.