Cloth Center
-
కౌ క్లాత్ స్టోర్
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఓ క్లాత్స్టోర్కు గత ఏడు సంవత్సరాలుగా చంద్రమణి డైలీ విజిటర్. అయితే చంద్రమణి అనేది మహిళ పేరు కాదు. ఒక ఆవు పేరు. చంద్రమణి రోజూ క్లాత్స్టోర్లోకి వచ్చి కాసేపు ఉండి పోతుంది. క్లాత్‌స్టోర్ యజమాని పదమ్ డాక్లియా ఎప్పుడూ ఆవును విసుక్కోలేదు. పైగా భక్తిభావంతో పూజిస్తాడు. వస్త్ర దుకాణానికి వచ్చే కొనుగోలుదారులకు ఈ ఆవు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ‘మహాలక్ష్మి క్లాత్ స్టోర్’ అనే పేరు కాస్త ‘కౌ క్లాత్ స్టోర్’గా మారింది. -
రూ.100 గిరాకీ చేసి.. రూ.10000 విలువైనవి ఎత్తుకెళ్లారు..
సాక్షి, నిజామాబాద్: ఓ బట్టల దుకాణంలో రూ.100ల గిరాకీ చేసి, రూ.10000 విలువ గల దుస్తులను చోరీ చేసిన ఘటన శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. మండలకేంద్రంలోని ఓ బట్టల దుకాణంలోకి గుర్తు తెలియని ముగ్గురు మహిళలు వచ్చి స్కార్ఫ్ కావాలని అడిగారు. యజమాని స్కార్ఫ్‌ను చూపిస్తుండగా.. మరో మహిళ ఇద్దరు పురుషులతో కలిసి దుకాణంలోకి వచ్చారు. తమకు బెడ్ షీట్లు కావాలని, తొందరగా చూపించాలని ఒత్తిడి తెచ్చారు. సదరు యజమాని మొదట వచ్చిన మహిళలను కొద్దిసేపు ఆగమని చెప్పి దుకాణంలోని రెండో గదిలోకి వెళ్లాడు. ఇదే సమయంలో మొదట వచ్చిన మహిళలు అక్కడ ఉన్న 10చీరెలున్న కట్ట, ఐదు ప్యాంట్ షర్టుల కట్టలను తమ చీర లోపల పెట్టుకున్నారు. తమకు స్కార్ఫ్ ఇవ్వాలని లేకుంటే వెళ్లిపోతామని యజమానిని తొందర చేశారు. దీంతో యజమాని ముందు రూంలోకి వచ్చి వారికి స్కార్ఫ్‌ను ఇవ్వగా.. వారు యజమానికి రూ.వంద నోటు ఇచ్చి వెళ్లి పోయారు. తదుపరి వచ్చిన మహిళ ఇద్దరు పురుషులకు యజమాని బెడ్షీట్లు చూపించగా అవి తమకు నచ్చిన రంగులో లేవని వెళ్లిపోయారు. వారందరూ వెళ్లిపోయిన తర్వాత దుకాణంలోని 10 చీరెల కట్ట, ఐదు ప్యాంటు షర్టుల కట్ట కనిపించకపోవడంతో సదరు యజమాని ఆందోళన చెందాడు. చుట్టుపక్కల దుకాణదారులకు విషయం వివరించగా.. సదరు గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలించారు. వారు దొరకకపోవడంతో యజమాని వేదనకు గురయ్యా డు. రెండేళ్ల క్రితం కూడా భిక్కనూరులోని ఓ బట్టల దుకాణంలో ఇదేవిధంగా చీరలను ఎత్తుకెళ్లారు. -
శానిటైజర్ అందిస్తోన్న రోబో
-
ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే
చెన్నై: కరోనా వచ్చిన నాటి నుంచి పలు దేశాల్లో రోబోల వాడకం పెరిగిపోయింది. కరోనా కట్టడి కోసం సామాజక దూరం తప్పని సరి కావడంతో రోబోల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఓ బట్టల దుకాణాదారుడు.. కస్టమర్ల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ఆలోచన చేశాడు. దానిలో భాగంగా షాప్‌లోకి వచ్చే కస్టమర్లకు శానిటైజర్ అందించడం.. టెంపరేచర్ చెక్ చేయడం కోసం ఓ రోబోను ఏర్పాటు చేశాడు. అంతటితో ఊరుకోక ఆ రోబోకు చక్కగా చీర కట్టి అందంగా ముస్తాబు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.(కరోనాపై పోరుకు కొత్త అస్త్రం!) సుధా రామేన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ‘తమిళనాడులోని ఓ బట్టల దుకాణం సాంకేతికతను సరైన మార్గంలో వినియోగించుకుంటోంది. చీర కట్టులో మెరిసిపోతున్న ఓ మర మనిషి కస్టమర్ల దగ్గరకు వెళ్లి శానిటైజర్ అందిస్తోంది’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇప్పటికే దీన్ని 35వేల మంది లైక్ చేశారు. ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే.. మోడల్ కం హెల్పర్.. మీ ఐడియా సూపర్’ అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు.(‘గాడిద సార్.. మాస్క్ ధరించదు’) -
మంచి ముత్యాలు
విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన విదేశీ వనితలు సిటీలో షాపింగ్ సరదా తీర్చుకుంటున్నారు. హెచ్‌సీయూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జువెలరీ.. క్లాత్ సెంటర్లలో విదేశీ వనితలు తమ అభిరుచికి తగ్గట్టుగా షాపింగ్ చేసుకుంటున్నారు. అక్కడే ఓ షాపులో ఖాదీ వస్త్రాలను, ముత్యాలహారాలను తీసుకుంటున్న కెనడాకు చెందిన షానూన్ పోలే, జామై రుక్లను సిటీప్లస్ పలకరించింది. ‘హైదరాబాద్‌కు వచ్చి ముత్యాలు కొనకుండా వెళ్తామా’ అంటూ షానూన్ పోలే ముత్యాలహారాన్ని మురిపెంగా చూశారు. ఇంత అందమైన, నాణ్యమైన వస్త్రాలను కొనకుండా ఎలా ఉండగలమన్నారు జామై రుక్మన్. వారు కొన్న వస్తువులను పేపర్ సంచుల్లో పెట్టి ఇవ్వడాన్ని మరింత ఎంజాయ్ చేశారు.