నిలిచిపోయిన గ్రీన్‌హౌస్ నిర్మాణ పనులు | Greenhouse construction work stopped | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన గ్రీన్‌హౌస్ నిర్మాణ పనులు

Published Sun, Nov 20 2016 12:55 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

నిలిచిపోయిన గ్రీన్‌హౌస్ నిర్మాణ పనులు - Sakshi

నిలిచిపోయిన గ్రీన్‌హౌస్ నిర్మాణ పనులు

- పెద్ద నోట్ల రద్దుతో చేతులెత్తేసిన కంపెనీలు
- అప్పులు చేసి రూ. లక్షలు తెచ్చుకున్న అన్నదాతలు...
- వాటి మార్పిడిలో ఇబ్బందులు
- మరోవైపు సబ్సిడీ రూ. 244 కోట్లు ఇవ్వకుండా చెయిచ్చిన సర్కారు
 
 సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల వ్యవహా రంతోపాటు ప్రభుత్వ చెల్లింపులు జరపక అనేకచోట్ల గ్రీన్‌హౌస్ నిర్మాణాలు తాత్కాలి కంగా నిలిచిపోయాయి. గ్రీన్‌హౌస్ నిర్మా ణం ఎకరాకు రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో రైతులు అదేస్థాయిలో నగదు సొమ్మును పాత రూ. 500, వెయ్యి నోట్లతో దగ్గర ఉంచుకున్నారు. అంత సొమ్మును బ్యాంకుల్లో మార్చుకోవడమూ కష్టసాధ్యంగా ఉండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతుల నుంచి కొత్త నోట్లు అందక కంపెనీలు అనేకచోట్ల తాత్కాలికంగా పనులు నిలిపివేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నారుు. చాలామంది వ్యాపారులు, ధనిక రైతులే గ్రీన్‌హౌస్ వైపు మొగ్గుచూపారు. భారీగా సొమ్ము దగ్గర ఉండటంతో వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో వేయాలంటే ఆదాయపు పన్నుశాఖ నుంచి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

 ఒకవైపు ప్రభుత్వ బకాయి... మరోవైపు పెద్ద నోట్ల రద్దు
 రాష్ట్రంలో గ్రీన్‌హౌస్ ద్వారా పెద్ద ఎత్తున కూరగాయలు, పూల దిగుబడులను పెంచాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. గ్రీన్‌హౌస్‌ను రైతుల్లోకి తీసుకెళ్లేందుకు భారీ సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఎకరంలో గ్రీన్‌హౌస్ నిర్మాణం చేపట్టడానికి రూ. 40 లక్షల వరకు ఖర్చు అరుుతే సబ్సిడీ కింద ప్రభుత్వమే రూ.30 లక్షలు భరిస్తుంది. ఇక ఎస్సీ, ఎస్టీలకు 95% సబ్సిడీగా ప్రభుత్వం నుంచి రూ. 38 లక్షలు భరిస్తుంది. దీంతో కొందరు రైతులు తమ వాటాను ముందుగానే కంపెనీలకు చెల్లించారు. ఇంకొందరు కొంత చెల్లించి మరికొంత చెల్లించేందుకు అప్పులు కూడా చేశారు.

ప్రభుత్వం నుంచి వివిధ దశల్లో సబ్సిడీ సొమ్ము రాకపోవడంతో దాన్నీ సొంతంగా చెల్లించేందుకు నగదు సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో వాటిని మార్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లలో ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కోసం రూ. 450 కోట్లు కేటారుుంచింది. కానీ ఇప్పటివరకు రూ. 58.50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు విడుదల చేయాల్సిన దాంతో పోలిస్తే ప్రభుత్వం రైతులకు రూ. 244.64 కోట్లు బకారుు పడింది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 95%, ఇతరులకు 75% సబ్సిడీ ప్రకటించడంతో అనేకమంది ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఎస్సీ, ఎస్టీలు కూడా పెద్ద నోట్ల రద్దు... సర్కారు బకారుులతో లబోదిబోమంటున్నారు. దీంతో కంపెనీలు కూడా మధ్యలోనే పనులు వదిలేసి పోయారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement