ఆగస్టు 21 నుంచి హజ్ యాత్ర: ఎస్‌ఏ షుకూర్ | Hajj journey from August 21: SA sukur | Sakshi
Sakshi News home page

ఆగస్టు 21 నుంచి హజ్ యాత్ర: ఎస్‌ఏ షుకూర్

Published Sat, Jun 18 2016 3:53 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

ఆగస్టు 21 నుంచి హజ్ యాత్ర: ఎస్‌ఏ షుకూర్

ఆగస్టు 21 నుంచి హజ్ యాత్ర: ఎస్‌ఏ షుకూర్

సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర-2016 ఆగస్టు 21 నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఏ షుకూర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ 2 ఎయిర్‌ఇండియా విమానాల్లో సుమారు 340 మంది యాత్రికుల చొప్పున జెద్దాకు బయలుదేరుతారన్నారు. చివరి రోజైన ఆగస్టు 28న ఒకే విమానం బయలుదేరి వెళ్తుందన్నారు.

హజ్ ప్రార్థనల అనంతరం యాత్రికులు హైదరాబాద్‌కు అక్టోబర్ 4 నుంచి 11 వరకు తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు. హజ్ యాత్రికుల కోసం హజ్ హౌస్‌లో ప్రత్యేక క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హజ్ యాత్రికులు 2 విడతల చార్జీలను జూలై 2 వరకు చెల్లించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement