హైదరాబాద్: బయో టెక్నాలజీ, ఐటీ రంగాల కారణంగా ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల నిర్ధారణ సులువవుతోందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్‌ఎఫ్‌ఐ) ఉపాధ్యక్షుడు ప్రొ.ప్రభాకరన్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మూడు రోజుల బయో ఆసియా సదస్సులో భాగంగా చివరిరోజైన బుధవారం 'డిజిటల్ హెల్త్ అండ్ హెల్త్‌కేర్ ఐటీ కాన్ఫరెన్స్' కార్యక్రమంలో ప్రభాకరన్ కీలకోపన్యాసం చేశారు.
ప్రజారోగ్య పరిరక్షణలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషించగలదని, అన్ని వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు చక్కటి వేదికని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు వ్యాధుల చికిత్సకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, ముందస్తు నివారణకూ అంతే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీతారెడ్డి మాట్లాడుతూ బయాలజీ, బైట్స్, బ్యాండ్‌విడ్త్‌లు ఆరోగ్యరంగాన్ని మార్చేస్తున్నాయని తెలిపారు.
టెక్నాలజీలతో ఆరోగ్య భాగ్యం
Published Thu, Feb 5 2015 3:17 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
Advertisement
Advertisement