మిషన్ కాకతీయ రెండో దశ(2016) అవార్డులను నీటిపారుదల శాఖ సోమవారం ప్రకటించింది.
‘సాక్షి’ రిపోర్టర్ సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డికి స్పెషల్ జ్యూరీ అవార్డు
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ రెండో దశ(2016) అవార్డులను నీటిపారుదల శాఖ సోమవారం ప్రకటించింది. ఇందులో ‘సాక్షి’ సీనియర్ రిపోర్టర్ సోమన్నగారి రాజశేఖర్ రెడ్డికి స్పెష ల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈ పురస్కారం కింద రూ.25 వేల ప్రైజ్ మనీతోపాటు నీటి పారుదల శాఖ ప్రత్యేక మెమొంటో ఇవ్వనుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ విభాగాల్లో ప్రథమ బహుమతి పొందిన వారికి రూ.లక్ష, ద్వితీయ బహుమతి పొందిన వారికి రూ.75 వేలు, తృతీయ బహుమతి పొందిన వారికి రూ.50 వేల ప్రైజ్‌మనీ, ప్రత్యేక మెమొంటో ఇవ్వ నున్నారు.
స్పెషల్ జ్యూరీ అవార్డు పొందిన వారికి రూ.25 వేల నగదు బహుమతి ఇస్తారు. స్పెషల్ కేటగిరీ కింద రెండు అవార్డులను ప్రకటించారు. వారికి రూ. లక్ష ప్రైజ్‌మనీ ఇవ్వను న్నారు. వివిధ వర్గాలు, వృత్తులు, ప్రజలపై చెరువు ల పునరుద్ధరణ ప్రభావం అంశంపై పత్రికల్లో వచ్చిన విశ్లేషణాత్మక కథనాలను ఎంట్రీలుగా స్వీకరించారు. వాటిని ప్రభుత్వం నియమించిన న్యాయ నిర్ణేతల కమిటీ క్షుణ్నంగా పరిశీలించింది.
అవార్డులు వీరికే..
ప్రింట్ మీడియా: గుండాల కృష్ణ–నమస్తే తెలంగాణ (ప్రథమ), గొల్లపూడి శ్రీనివాస్–ది హిందూ (ద్వితీయ), ఇ.గంగన్న–ఆంధ్రజ్యోతి (తృతీయ)
స్పెషల్ జ్యూరీ అవార్డులు: దామరాజు సూర్యకుమార్ (చరిత్ర పరిశోధన)–తెలంగాణ మ్యాగజైన్, సంగనభట్ల నర్సయ్య–తెలంగాణ మ్యాగజైన్, సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి–సాక్షి దినపత్రిక, బి.రాజేందర్–ఈనాడు.
ఎలక్ట్రానిక్ మీడియా: గోర్ల బుచ్చన్న– వీ6 (ప్రథమ), యం.మాని కేశ్వర్–ఈటీవీ (ద్వితీయ), బి.శివకుమార్– టీన్యూస్ (తృతీయ)
స్పెషల్ జ్యూరీ అవార్డులు: దొంతు రమేశ్–టీవీ–9, బి.నరేందర్–టీవీ–5.
స్పెషల్ కేటగిరీ: కంది రామచంద్రారెడ్డి (వీడియో ఫిలిం), తైదల అంజయ్య(వీడియో సాంగ్)లు ఉన్నా రు. ప్రోత్సాహక బహుమతి కింద బాసర ఆర్జీయూ కేటీ విద్యార్థిణి తేజస్వినికి 10 వేల ప్రత్యేక బహుమతి ప్రకటించారు. జ్యూరీలో చైర్మన్‌గా అల్లం నారా యణ, సభ్యులుగా చింతల ప్రశాంత్‌రెడ్డి –రెసిడెంట్ ఎడిటర్ (ది హిందూ), కట్టా శేఖర్ రెడ్డి–ఎడిటర్ (నమస్తే తెలంగాణ), ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఉన్నారు. అవార్డులు పొందిన జర్నలిస్టులకు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.