రాష్ట్రానికి మహారాష్ట్ర బృందం
మిషన్ కాకతీయపై అధ్యయనానికి మూడు రోజుల పర్యటన
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ అమలు తీరును అధ్యయనం చేసేందుకు ఈ నెల 13న ఐదుగురు సభ్యులతో కూడిన మహారాష్ట్ర బృందం హైదరాబాద్ రానుంది. మూడు రోజులపాటు ఈ బృందం క్షేత్ర స్థాయి పర్యటనలు చేయడంతోపాటు సాగు నీటి పారుదల అధికారులతో సమావేశం కానుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర బృందానికి వసతితోపాటు క్షేత్రస్థాయి పర్య టనలకు అవసరమైన ఏర్పాట్ల కోసం ఒక లైజన్ అధికారిని నియమించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి హరీశ్‌రావు శని వారం ఆదేశించారు. కాకతీయను ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ప్రశం సించడమే కాకుండా దీనిపై అధ్యయనం చేసి అమలు చేయాలని తమిళనాడుకి సూచించారని హరీశ్ తెలిపారు.
తమిళనాడు బృందం కూడా రానున్నట్లు కొద్దిరోజుల క్రితం సమా చారం వచ్చిందన్నారు. తెలంగాణవ్యాప్తంగా 46,531 చిన్న నీటి వనరుల పునరుద్ధరణ లో భాగంగా దశల వారీగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 11 వేల చెరువులకు పునర్జన్మ లభించిందని, రూ.5,700 కోట్ల పరిపాలనాపరమైన అనుమతులతో మిషన్ కాకతీయ–1, మిషన్ కాకతీయ–2 కింద 17 వేల చెరువుల పనులను ప్రభుత్వం చేపట్టిం దని వివరించారు. ఇప్పటివరకు రూ.1,800 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఈ రెండు విడతలలో దాదాపు 15లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకు న్నామని, ఇప్పటివరకు దాదాపు 5 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అంచ నా వేస్తున్నట్టు మైనర్ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మిషన్ కాకతీయ తొలిదశలో 4 కోట్ల 74 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత జరిగిందని, రెండు విడతలలో కలిపి 8 కోట్ల 27 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్టు సీఈ బి.నాగేందర్ రావు తెలిపారు.