సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవేశ అర్హతల మార్కులను మార్చడాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యా జ్యాన్ని మంగళవారం జస్టిస్ కోదండరామ్ విచారించారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ... పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి ఓయూ 2014లో నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఓసీలకు 50, బీసీలకు 40, ఎస్సీ, ఎస్టీలకు 30 మార్కులను ప్రవేశార్హత మార్కులుగా నిర్ణయించిందన్నా రు. ఫలితాలు వెల్లడించేదశలో నిర్దిష్టమైన కారణాలేవీ లేకుండానే మార్కులను 40, 30, 20గా మార్చారన్నారు. ఈ వ్యవహా రంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఓయూ అధికారులను న్యాయ మూర్తి ఆదేశించారు.
ఓయూ పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాలపై హైకోర్టు స్టే
Published Wed, Jun 22 2016 2:26 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement