హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉస్మానియాలో గురువారం నిర్వహించనున్న జన జాతర సభకు రాజకీయ నేతలకు అనుమతి లేదని హైకోర్టు ఆదేశించినా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ విద్యార్థులు పలువురు నేతలను జన జాతర సభకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తోపాటు ఇతర నేతలకు విద్యార్థులు ఆహ్వానం పంపినట్టు తెలిసింది. అయితే వర్సిటీలోకి రాజకీయ నేతలను అనుమించొద్దంటూ న్యాయ విద్యార్థి రాహుల్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలను ఓయూలోకి అనుమతించొద్దంటూ న్యాయస్థానం ఓయూ ఉన్నతాధికారులను ఆదేశించిన సంగతి విధితమే.
ఈ క్రమంలో కోర్టు ఆదేశాల ప్రకారం రాజకీయ నేతలను అనుమతించబోమని పోలీసులు ఒకవైపు చెబుతుంటే... అయినా రేవంత్ రెడ్డి సభకు తప్పకుండా హాజరవుతారంటూ మరోవైపు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఓటుకు కోట్లు కేసు నిందితులు జిమ్మిబాబు, ఉదయ్ సింహా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.
'..అయినా రేవంత్ రెడ్డి హాజరవుతారు'
Published Thu, Jun 2 2016 6:10 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement