ఓయూలో రాజకీయ సభలకు బ్రేక్
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్శిటీలో రాజకీయ సభలకు హైకోర్టు బ్రేక్ వేసింది. వర్శిటీలో రాజకీయ సమావేశాలకు అనుమతించరాదని హైకోర్టు గురువారం ఓయూ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. కాగా నేడు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ జన జాతర నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ న్యాయ విద్యార్థి రాహుల్ ...హైకోర్టును ఆశ్రయించాడు.
పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం యూనివర్శిటీలో సభలకు అనుమతించరాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉస్మానియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు వర్సిటీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు సీఎం కేసీఆర్ పాలనా తీరుకు వ్యతిరేకంగా ‘తెలంగాణ జన జాతర’ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. హైకోర్టు తాజా నిర్ణయంతో జన జాతర సభకు బ్రేక్ పడినట్లే.