Justice kodandaram
-
ఆ కోర్సులకు అనుమతిపై పునఃపరిశీలన
సాక్షి, హైదరాబాద్: కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 2019–20 విద్యా సంవత్సరానికి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను ప్రారంభించేందుకు అనుమతిని నిరాకరించిన నేపథ్యంలో, మరోసారి దీనిపై పునఃపరిశీలన చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు కోర్సులకు అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ కామినేని దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కోదండరామ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కోర్సులకు అనుమతినిచ్చే ముందు ఎంసీఐ పరిశీలకులు తనిఖీలు చేస్తారని, అలాగే తమ కాలేజీలో కూడా తనిఖీలు చేసి, పలు లోపాలను ఎత్తి చూపారన్నారు. ఈ లోపాలను సరిదిద్దుకున్నామని, మరోసారి తనిఖీ చేసిన అధికారులు, మళ్లీ లోపాలున్నాయన్నారు. లేవనెత్తిన లోపాలను సరిదిద్దుకున్నా, కోర్సులకు అనుమతినివ్వడం లేదన్నారు. అయితే ఈ వాదనలను ఎంసీఐ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. సర్జరీలు ఎన్ని చేశారన్న విషయంలో కామినేని ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని, అందుకే ఈ నిబంధన విషయంలో ఎంసీఐ అధికారులు రాజీపడలేదని చెప్పారు. -
రోడ్ల విస్తరణ చేపట్టట్లేదు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను విస్తరించట్లేదని, రోడ్డు ప్రమాదాలను నివారించే విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. ఈ లేఖను పిల్ కమిటీ సిఫారసుల మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, ట్రాఫిక్ డీసీపీలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య వల్ల సగం రోజు రోడ్లపైనే గడిచిపోతోందని భాస్కర్ తన లేఖలో పేర్కొన్నారు. తగిన స్థాయిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించలేదని, దీంతో పాదచారులు రోడ్డు దాటడం కష్టమవుతోందన్నారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండటం వల్ల వాహనాలను కూడా రోడ్లపై నిలుపుతున్నారని, ఇది కూడా ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా మారిందని వివరించారు. ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకుని వాహనదారులు త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, దీంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లకు, మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు నిర్వహించే విషయంలో ఆయా శాఖల మధ్య సమన్వయం ఉండట్లేదన్నారు. ఆర్టీసీ బస్సులను కూడా రోడ్ల మధ్యలో అకస్మాత్తుగా ఆపుతున్నారని, వీటి వల్ల వెనుక వచ్చే వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారని, కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయని చెప్పారు. పార్కింగ్ ప్రదేశంలో షాపులు.. పిల్ కమిటీలోని న్యాయమూర్తులందరూ కూడా ఈ లేఖను పిల్‌గా పరిగణించాలని ఏకగ్రీవంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ సమయంలో స్టిల్ట్ ఏరియాను పార్కింగ్ కోసం చూపుతున్నా, ఆ తర్వాత దాన్ని వాణిజ్య అవసరాల కోసం దుకాణాలుగా మారుస్తున్నారని కమిటీ లోని న్యాయమూర్తి జస్టిస్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. దీంతో వాహనదారులు రోడ్లపైనే తమ వాహనాలను నిలపాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఈ అభిప్రాయంతో న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ ఏకీభవించారు. -
ఓయూ పీహెచ్డీ కోర్సుల ప్రవేశాలపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీలో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవేశ అర్హతల మార్కులను మార్చడాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యా జ్యాన్ని మంగళవారం జస్టిస్ కోదండరామ్ విచారించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ... పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి ఓయూ 2014లో నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఓసీలకు 50, బీసీలకు 40, ఎస్సీ, ఎస్టీలకు 30 మార్కులను ప్రవేశార్హత మార్కులుగా నిర్ణయించిందన్నా రు. ఫలితాలు వెల్లడించేదశలో నిర్దిష్టమైన కారణాలేవీ లేకుండానే మార్కులను 40, 30, 20గా మార్చారన్నారు. ఈ వ్యవహా రంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఓయూ అధికారులను న్యాయ మూర్తి ఆదేశించారు.