గచ్చిబౌలి: మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన 11వ మెట్రోపొలిస్ సదస్సుకు సైబరాబాద్ పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం స్వయంగా పర్యవేక్షించారు. సైబరాబాద్ కమిషనరేట్‌తో పాటు వరంగల్ అర్బన్, రూరల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన సుమారు 900 మంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన నలుగురు డీసీపీలు, అడిషనల్ ఎస్పీ, నలుగురు ఏసీపీలు, 18 మంది ఇన్‌స్పెక్టర్లు, 59 మంది ఎస్‌ఐలు, నలుగురు మహిళా ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు మహిళా ఎస్‌ఐలు, 332 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 41 మంది మహిళాకానిస్టేబుళ్లు, 100 మంది హోంగార్డులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాలకు చెందిన ముగ్గురు డీఎస్‌పీలు, 12 మంది ఇన్‌స్పెక్టర్లు, 39 మంది ఎస్‌లు, ఏడుగురు మహిళా ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, 209 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 10 ప్ల్లటూన్‌ల ఏపీఎస్‌పీ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.
అడుగడుగునాతనిఖీలు...
విదేశీ ప్రతినిధులు, వీవీఐపీల రాకతో సైబర్‌టవర్ నుంచి హెచ్‌ఐసీసీ వరకు పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్విహ ంచారు. ప్రధాన రహదారులతో పాటు సర్వీస్ రోడ్లను పోలీసు జాగిలాలతో జల్లెడ పడుతున్నారు. న్యాక్ ప్రధాన ద్వారం వద్ద వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఐడీ కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. మీడియా ప్రతినిధులను హైటెక్స్‌లోని మీడియా సెంటర్ వరకే అనుమతించారు.
‘మెట్రో’ సదస్సుకు భారీ భద్రత
Published Tue, Oct 7 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement
Advertisement