ఓటు మీకు... ఆట మాకు..
ఆటలు తప్ప ఓటు అంటే తెలియని వయసు.. ఆకలి తప్ప పార్టీలు ఎరగని మనసు.. రంగులు మార్చడం రాదు.. ఏమార్చడం అంతకంటే రాదు.. పూటకో పార్టీ కండువా కప్పుకుని.. గంటకో జెండా పట్టుకునే కాలంలో.. రంగుల హంగులు తెలియని బాల్యం పార్టీ జెండాలతో స్వేచ్ఛగా ఆడుకుంటోంది. మారో పార్టీవారు అడ్డుకుంటారన్న భయం లేదు.. పదవులు పోతాయన్న బాధా లేదు.. ఆ చేతుల్లో ఉన్న జెండా ఏ పార్టీదైనా ఎజెండా ఒక్కటే.
నెత్తిన పెట్టుకుంటారు.. కింద పడేస్తారు.. అడిగేదెవరు.. అంతా ఆటలో భాగమే. జూబ్లీహిల్స్ దుర్గాభవానీ నగర్‌లో ఆదివారం ఉదయం ఓ పార్టీ మీటింగ్ జరిగింది. అక్కడి బస్తీ ప్రజలు సమావేశానికి వెళ్లివచ్చారు. వారు తెచ్చిన పార్టీ జెండాలు, టోపీలను పిల్లలకు ఇవ్వడంతో వారు ఇలా ఆటవస్తువులుగా మార్చుకున్నారు.