సీసీ కెమెరాలు ఉంటేనే ప్రాక్టికల్‌ కేంద్రాలు! | Intermediate Board Decision on Practical Exams CC cameras in telangana | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాలు ఉంటేనే ప్రాక్టికల్‌ కేంద్రాలు!

Jan 11 2017 3:34 AM | Updated on Aug 14 2018 3:37 PM

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను నిఘా నీడన నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: వచ్చేనెల 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను నిఘా నీడన నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కాలేజీల్లోనే పరీక్ష కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,300 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ పేర్కొన్నారు.

ఈ పరీక్షల ను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రతి జిల్లాలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణను  పర్యవేక్షించనున్నట్లు వివరించారు. మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నాటికి రూట్‌ మ్యాప్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థి తన హాల్‌టికెట్‌ నంబర్‌ను యాప్‌లో ఎంటర్‌ చేయగానే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలన్న రూట్‌ మ్యాప్‌ మొబైల్‌లో ప్రత్యక్షం అయ్యేలా చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement