రూ.కోటి నకిలీ నోట్లు ఎక్కడివి...? | investigation on face corency found at srikakulam | Sakshi
Sakshi News home page

రూ.కోటి నకిలీ నోట్లు ఎక్కడివి...?

Published Wed, Jul 8 2015 10:11 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

రూ.కోటి నకిలీ నోట్లు ఎక్కడివి...? - Sakshi

రూ.కోటి నకిలీ నోట్లు ఎక్కడివి...?

హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో టీడీపీ నాయకులు చెలామణి చేసిన రూ.కోటి నకిలీ కరెన్సీ రాకెట్ హైదరాబాద్‌ను తాకింది.

ఏపీ ప్రభుత్వ విప్ రవికుమార్‌కు ప్రధాన అనుచరులుగా చెలామణి అవుతున్న గోనెపాడు ఉపసర్పంచ్ మామిడి తిరుపతిరావు, కీలక సూత్రధారిగా గుడివలసకు చెందిన నడికుర్తి వసంతరావు, అన్నెవరపు ఈశ్వర్‌రావు, కవిటినాయుడు, లక్ష్మణ్‌రావులు హైదరాబాద్‌లోని బాలానగర్ కేంద్రంగా కొనసాగిస్తున్న నకిలీ కరెన్సీ రాకెట్‌ను ఇక్కడి పోలీసులు పసిగట్టి, శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

దీంతో రెండు రోజుల క్రితం వసంతరావు బృందాన్ని శ్రీకాకుళం జిల్లా పోలీసులు హైదరాబాద్‌కు తీసుకువచ్చి నకిలీ కరెన్సీ వ్యవహారానికి సంబంధించిన వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ గ్యాంగ్‌లో అన్నెపు ఈశ్వర్‌రావు బాలానగర్ ప్రాంతంలోనే చాలాకాలంగా నివసిస్తుండటంతో ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement