
సాక్షి, హైదరాబాద్: ఇస్రో గొప్ప విజయాలు సాధించిందని.. వాటి ఫలితాలను ప్రస్తుతం అనుభవిస్తున్నామని ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఏఎస్ కిరణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన పోలీస్ అకాడమీలో ఐపీఎస్ వ్యాస్ స్మారకోపన్యాసం ఇచ్చారు. రోడ్ నావిగేషన్, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, రైల్వే భద్రతలో టెక్నాలజీ వినియోగం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ తదితర అంశాల్లో ఇస్రో ప్రవేశపెట్టిన సాంకేతికతను ఆయన పోలీస్ అధికారులకు వివరించారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల పోలీస్ విభాగాల సక్సెస్‌కు వ్యాస్ ఒక మార్గనిర్దేశకుడని అన్నారు. వ్యాస్ ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ ఇప్పుడు దేశంలోనే అత్యంత కీలకమైన బలగంగా పేరు సంపాదించిందన్నారు. కార్యక్రమంలో వ్యాస్ సతీమణి అరుణా వ్యాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం వ్యాస్ బాగా కృషి చేశారని, పోలీస్ శాఖ కోసం ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తని గుర్తుచేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, అకాడమీ డైరెక్టర్ జితేందర్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment