
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఈ నెల 10న పీఎస్‌ఎల్‌వీ సీ40 ప్రయోగాన్ని చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ను రోదసీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత నెల 10 నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ40 క్యాంపెయిన్‌ను ప్రారంభించి నాలుగు దశల రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేసింది.
డిసెంబర్ ఆఖరి వారంలో ప్రయోగించాలని తొలుత నిర్ణయించినా, రాకెట్‌కు సంబంధించిన కొన్ని విడిభాగాలు షార్‌కు చేరుకోకపోవడంతో జనవరికి వాయిదా వేశారు. ఈ రాకెట్ ద్వారా 30 ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. ఇందులో దేశీయ అవసరాల కోసం కార్టోశాట్–2 సిరీస్‌లో ఓ ఉపగ్రహం ఉండగా, మిగిలిన 29 విదేశాలకు చెందినవే. గతేడాది ఆగస్టు 31న నిర్వహించిన పీఎస్‌ఎల్‌వీ సీ39 ప్రయోగం విఫలం కావడంతో, ఈసారి ఎలాంటి తప్పిదాలకు చోటివ్వకుండా శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment