AS Kiran Kumar
-
ఇస్రో గొప్ప విజయాలు సాధించింది
సాక్షి, హైదరాబాద్: ఇస్రో గొప్ప విజయాలు సాధించిందని.. వాటి ఫలితాలను ప్రస్తుతం అనుభవిస్తున్నామని ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఏఎస్ కిరణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన పోలీస్ అకాడమీలో ఐపీఎస్ వ్యాస్ స్మారకోపన్యాసం ఇచ్చారు. రోడ్ నావిగేషన్, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, రైల్వే భద్రతలో టెక్నాలజీ వినియోగం, డిజాస్టర్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ తదితర అంశాల్లో ఇస్రో ప్రవేశపెట్టిన సాంకేతికతను ఆయన పోలీస్ అధికారులకు వివరించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల పోలీస్ విభాగాల సక్సెస్‌కు వ్యాస్ ఒక మార్గనిర్దేశకుడని అన్నారు. వ్యాస్ ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ ఇప్పుడు దేశంలోనే అత్యంత కీలకమైన బలగంగా పేరు సంపాదించిందన్నారు. కార్యక్రమంలో వ్యాస్ సతీమణి అరుణా వ్యాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం వ్యాస్ బాగా కృషి చేశారని, పోలీస్ శాఖ కోసం ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తని గుర్తుచేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, అకాడమీ డైరెక్టర్ జితేందర్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
దేశానికి న్యూ ఇయర్ గిఫ్ట్: ఇస్రో ఛైర్మన్
సాక్షి, శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ఒకేసారి 30 ఉపగ్రహాలతో పాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో శుక్రవారం ఉదయం ఈ ఘనత సాధించింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో అధికారులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కార్టోశాట్-2ను విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇది కొత్త సంవత్సరం సందర్భంగా దేశానికి ఇస్రో ఇచ్చిన కానుక అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని ఆయన ప్రకటించారు. కొత్త ఛైర్మెన్ శివన్‌కు అద్భుత విజయంతో ఘన స్వాగతం పలికామన్నారు. ఫిబ్రవరిలో జీఎస్ఎల్వీ మార్క్2 ద్వారా సమాచార ఉపగ్రహాన్ని పంపేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ ఏడాది 3 జీఎస్ఎల్వీ, 9 పీఎస్ఎల్వీ రాకెట్లను కక్షలోకి పంపే దిశగా సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం 2 లాంచ్ ప్యాడ్ల ద్వారా ప్రయోగాలు జరుగుతున్నాయి, 3వ లాంచ్ ప్యాడ్ త్వరలోనే సిద్ధమవుతుందన్నారు. పీఎస్ఎల్వీ ద్వారా విస్తృతంగా ఉపగ్రహాలను పంపగలుగుతున్నాం కాబట్టే దేశ, విదేశాల ప్రతినిధులు ఇస్రోను సంప్రదిస్తున్నారు. చిన్న సమస్య వల్లే గతంలో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-39 విఫలమైందని కిరణ్ కుమార్ తెలిపారు. షార్ డైరెక్టర్ కె కృష్ణన్ మాట్లాడుతూ పీఎస్ఎల్వీ సీ40 ప్రయోగం విజయవంతం కావడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఇదే ఉత్సాహంతో చంద్రయాన్-2.. జీఎస్ఎల్వీ మార్క్-2 ప్రయోగాలకు సన్నద్ధం అవుతామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందిస్తామన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి కృషితోనే ప్రయోగం విజయవంతమైందన్నారు. ఈసందర్భంగా ప్రయోగంలో కీలకంగా పనిచేసిన శాష్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. -
నేడే పీఎస్ఎల్వీ సీ38 ప్రయోగం
మొత్తం 31 ఉపగ్రహాలను నింగికి పంపనున్న ఇస్రో ఇందులో 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలు మనదేశానికి చెందినవి రెండు శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి నేడు శ్రీకారం చుట్టింది. నేటి ఉదయం 9.29 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ38 ద్వారా మొత్తం 31 ఉపగ్రహాలను ప్రయో గించనుంది. ఇందులో రెండు మనదేశానికి చెందినవి. వీటిలో 712 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2ఈ ఉపగ్రహంతోపా టు దేశీయ యూనివర్సిటీకి చెంది న ఒక చిన్న ఉపగ్రహం ఉంది. ఇవికాకుండా 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను నింగిలో పం పేందుకు సర్వం సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ షార్ చేరుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రాకెట్‌కు తుదివిడత తనిఖీలు నిర్వహించారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 40వ ప్రయోగం కాగా, ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల ప్రయోగంలో 17వ ప్రయోగం కావ డం విశేషం. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం పీఎస్ఎల్వీ సీ38 నమూ నా రాకెట్‌ను శ్రీవారి పాదాలచెంత ఉంచి ఇస్రో డైరెక్టర్, యశోద శాస్త్రవేత్తలు కృష్ణమూర్తి, జయరామన్, ఎస్కే కనుంగో, సేతురామన్ పూజలు నిర్వహించారు. దేశీయ అవసరాల కోసమే కార్టోశాట్–2 దేశీయ అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్ సిరీస్ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు. 2007 జనవరి 10న పీఎస్ఎల్వీ సీ7 ద్వారా కార్టోశాట్–2, 2008 ఏప్రిల్ 28న పీఎస్ఎల్వీ సీ9 ద్వారా కార్టోశాట్–2ఏ, 2010 జూలై 12న పీఎస్ఎల్వీ సీ15 ద్వారా కార్టోశాట్–2బీ, 2016 జూన్ 22న పీఎస్ఎల్వీ సీ34 ద్వారా కార్టోశాట్–2సీ, 2016 ఫిబ్రవరి 15 కార్టోశాట్–2డీతో ఇప్పటికే 5 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. మరింత సమాచారం పొందడానికి నేడు పీఎస్ఎల్వీ సీ38 ద్వారా కార్టోశాట్–2ఈ ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉపగ్రహ వ్యవస్థ సూర్యానువర్తన «ధృవ కక్ష్యలో వివిధ దశల్లో పరిభ్రమిస్తూ భౌగోళికపరమైన సమాచారాన్ని అందిస్తోంది. దీనిలో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్ మల్టీస్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను అందిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూవినియో గంపై మ్యాప్‌ల తయారు, విపత్తులను విస్తృతంగా అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సమాచారం అందుబాటులోకి వస్తుంది. భూమ్మీది మార్పులను ఎప్పటికప్పుడు ఛాయాచిత్రాలు తీసి పంపుతుంది. సుమారు రూ.350 కోట్లు వ్యయం చేసినట్టు సమాచారం. ఈ ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలు అందిస్తుంది. -
నింగిలోకి దూసుకెళ్లిన సీ-37
-
నేడే ఇస్రో అద్వితీయ ప్రయోగం
-
ఒక రాకెట్.. 104 ఉపగ్రహాలు!
► నేడే ఇస్రో అద్వితీయ ప్రయోగం ► ఉదయం 9.28కి నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ ► రికార్డు స్థాయిలో ఒకే ప్రయోగంలో కక్ష్యలోకి 104 ఉపగ్రహాలు ► కార్టోశాట్ 2డీ సహా మూడు స్వదేశీ శాటిలైట్లు అంతరిక్ష ప్రయోగాల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ప్రపంచస్థాయి ప్రయోగాలకు వేదికైన షార్ నుంచి, గెలుపు గుర్రం పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. రికార్డు స్థాయిలో ఒకే ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను గ‘ఘన’ ప్రయాణానికి సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 9.28 గంటలను ఇందుకు ముహూర్తంగా నిర్ణయించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలను నింగికి పంపిన దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఇస్రో ఘన చరిత మరోసారి ప్రపంచానికి తేటతెల్లమవుతుంది. ఆల్ ది బెస్ట్ ఇస్రో టీమ్..! ఆల్ ది బెస్ట్ ఇండియా..!! శ్రీహరికోట (సూళ్లూరుపేట): రికార్డు స్థాయిలో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను నింగికి మోసుకెళ్లే అద్వితీయ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ ను మంగళవారం ఉదయం 5.28 గంటలకు ప్రారంభించారు. దాదాపు 28 గంటల కౌంట్‌డౌన్ నంతరం పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ప్రయోగం నాలుగు దశల్లో, 28.42 నిమిషాల్లో పూర్తయ్యేలా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది పీఎస్ఎల్వీకి 39వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా మూడు స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. 714 కిలోల బరువైన కార్టోశాట్ 2డీ, ఇస్రో నానో శాటిలైట్స్ అయిన ఐఎన్ ఎస్–1ఏ, ఐఎన్ ఎస్–1బీలు స్వదేశీ ఉపగ్రహాలు. విదేశీ ఉపగ్రహాల్లో 96 అమెరికాకు చెందినవి కాగా, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం కూడా ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటున్నాయి. కార్టొశాట్ 2డీ ఉపగ్రహం రిమోట్ సెన్సింగ్ సేవలను ఐదేళ్ల పాటు అందిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను పంపిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. గతంలో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకే రాకెట్‌తో 37 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించింది. జూన్ 2015లో ఇస్రో సైతం ఒకే ప్రయోగంలో 23 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మంగళవారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైన వెంటనే రాకెట్‌కు నాలుగో దశలో అవసరమైన 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ దశలో మోనో మిథైల్ హైడ్రోజన్ (ఎంఎంహెచ్), మిక్స్డ్ ఆక్సిడైజడ్ ఆఫ్ నైట్రోజన్ (ఎంఓఎన్ –3) ఇంధనాన్ని నింపారు. అనంతరం నాలుగో దశకు అన్ని పరీక్షలు చేసి బాగుంది అని నిర్ధారించుకున్నాక సోమవారం రాత్రి రెండోదశలో అవసరమైన 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. అనంతరం ఇంధనం నింపే ప్రక్రియను పూర్తి చేసి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగానికి సిద్ధమవుతారు. కాగా, మంగళవారం సాయంత్రం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ షార్ చేరుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రాకెట్‌కు తుదివిడత తనిఖీలు నిర్వహించారు. ఆ తరువాత సహచర సైంటిస్టులతో సమీక్ష నిర్వహించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమవ్వాలని దేశవ్యాప్తంగా ప్రజలు పూజలు, ర్యాలీల ద్వారా తమ ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సైతం దీనిపై భారీ చర్చ సాగుతోంది. శ్రీవారి చెంత పూజలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో పీఎస్ఎల్వీ సీ–37 నమూనా రాకెట్‌కు మంగళవారం పూజలు నిర్వహించారు. మంగళవారం ఇస్రో డైరెక్టర్లు జయరామన్, డాక్టర్ కనుంగో, డాక్టర్ జగదీశ్ శ్రీవారిని దర్శించుకున్నారు. నమూనా రాకెట్‌తో శ్రీవారి పాదాల చెంత పూజలు నిర్వహించారు. -
'సమాజాభివృద్ధికి అంతరిక్ష పరిశోధనలు'
హైదరాబాద్: మానవసహిత అంతరిక్ష ప్రయోగం ఎప్పుడు జరగాలన్నది నిర్ణయించాల్సింది తాము కాదని, దేశ ప్రజలు, ప్రభుత్వమేనని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ ఏఎస్ కిరణ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అంతరిక్ష ప్రయోగాలను మానవ సమాజాభివృద్ధికి మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలన్నదే ఇస్రో లక్ష్యమని ఆయన అన్నారు. రామకృష్ణమఠం ఆధ్వర్యంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 15వ వార్షికోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిరణ్‌కుమార్ కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కీలక సాంకేతిక పరిజ్ఞానాలను అభివద్ది చేసుకుంటున్నా.. అసలు ప్రయోగం ఎప్పుడన్నది మాత్రం ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. అందుబాటులోని వనరులను సమర్థంగా, సృజనాత్మకంగా వాడుకోవడం ద్వారా, సమష్టి కృషితో మంగళ్యాన్ ప్రయోగం విజయవంతమైందని అన్నారు. శాస్త్రవేత్తలైనా, ఆధ్యాత్మికవేత్తలైనా ఇద్దరి లక్ష్యం సత్యాన్ని శోధించడమేనని తెలిపారు శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచంలోని వస్తువులపై ప్రయోగాలు చేస్తూ అంతిమ సత్యాన్ని అన్వేషిస్తే... ఆధ్యాత్మిక వేత్తలు ఇదే పనిని మెదడు, చేతనావస్థల సాయంతో చేపడతారని వివరించారు. దాదాపు వందేళ్ల క్రితమే వివేకానందుడి ఆలోచనల ఫలితంగా బెంగళూరులో దేశం గర్వించదగ్గ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సైస్ ఏర్పడిందని అక్కడ విద్యనభ్యసించిన విక్రమ్ సారాభాయ్, సతీశ్‌ధవన్ వంటి మహామహులు ఇస్రోకు ప్రాణం పోశారని అన్నారు. ఈ క్రమంలో సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యమివ్వడం ద్వారా ప్రకతి సమతౌల్యాన్ని కాపాడాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో రామకృష్ణమఠం హైదరాబాద్ విభాగం అధ్యక్షులు జ్ఞానానంద మహారాజ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డెరైక్టర్ వి.కె.గాడ్గిల్ తదితరులు పాల్గొన్నారు.