భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ-37(104 ఉపగ్రహాల ప్రయోగం) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. బుధవారం ఉదయం 9.28 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ సీ-37 గగనతలంలోకి ప్రయాణం మొదలు పెట్టింది. మొత్తం నాలుగు దశల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగం ద్వారా మూడు స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు.