- ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వినియోగిస్తోందని తెలంగాణ చేసిన ఫిర్యాదుపై స్పందించి సంయుక్త పర్యవేక్షణ కమిటీ నియమించిన కృష్ణా బోర్డు, ప్రస్తుతం ఏపీ చేసిన ఫిర్యాదులపైనా స్పందించింది. జూరాల, శ్రీశైలం నుంచి తెలంగాణ అధిక నీటిని వినియోగిస్తోందన్న ఫిర్యాదుపై సంయుక్త కమిటీతో విచారణ చేసేందుకు సిద్ధమైంది.
జూరాల, శ్రీశైలం నుంచి నీటి వినియోగ లెక్కలను ఎప్పటికప్పుడు గణించి, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లెక్కలు పక్కాగా చూసుకునేందుకు వీలుగా అధికారుల పేర్లు సూచించాలని శుక్రవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి కేసీ కెనాల్ ద్వారా సాగునీటికి 11 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ అవసరాలకు 2.5 టీఎంసీలు విడుదల చేయాలంటూ ఏపీ పెట్టుకున్న అభ్యర్థనపై స్పందించాలని తెలంగాణకు విడిగా మరో లేఖ రాసింది.
జూరాల, శ్రీశైలం అతి వినియోగంపై సంయుక్త పర్యవేక్షణ
Published Sat, Oct 1 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
Advertisement