సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుతో ఆదివారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు జ్యోతులు నెహ్రూ, వరుపుల సుబ్బారావులు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని యనమల నివాసానికి మీడియా కంటపడకుండా వెనకవైపు ద్వారం గుండా లోపలికి వెళ్లిన ఇరువురు ఎమ్మెల్యేలు అదే దారిన బయటకు వెళ్లారు. యనమలతో వీరి భేటీ సుమారు గంటకు పైగా సాగింది. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ వీరిని యనమల వద్దకు తీసుకువెళ్లారు.
వలసలను ప్రోత్సహిద్దాం: లోకేశ్
వలసలను ప్రోత్సహించి ఇతర పార్టీలకు చెందిన వారిని టీడీపీలో చేర్చుకోవాలనేది ప్రస్తుతం పార్టీ అమలు చేస్తున్న విధానమని, దానికి అందరూ సహకరించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తూర్పు గోదావరి జిల్లా నేతలకు సూచించారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎవరెవర్ని పార్టీలో చేర్చుకోవాలనే అంశంపై చర్చించేం దుకు ఆదివారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పలువురు ఎమ్మెల్యేలు, నేతలతో లోకేశ్ భేటీ అయ్యారు.
యనమలతో జ్యోతుల, వరుపుల భేటీ
Published Mon, Mar 28 2016 1:55 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM
Advertisement
Advertisement